ది గ్లోబ్ పాఠశాల అన్నివెర్సరీ సెలెబ్రేషన్స్ .
విశాఖ లోకల్ న్యూస్ :మధురవాడ
మధురవాడ ది గ్లోబ్ పాఠశాల అన్నివెర్సరీ డే కార్యక్రమం ది గ్లోబ్ పాఠశాల చైర్మన్ బి. వి. రావు , కరస్పాండెంట్ అనురాధ, డైరెక్టర్ వసంత కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 5..30 నుండి 9.0 గంటల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లల ఆట పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముఖ్య అతిధితులుగా పాల్గొన్నారు.ది గ్లోబ్ పాఠశాల చైర్మన్ బి. వి రావు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం పొల్యూషన్ లేని ప్రాంతంలో పాఠశాల నిర్మించి ఉన్నత విలువలు,అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో విద్యను అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లితండ్రులే అతిధిలుగా విచ్చేసారని తెలిపారు.


