మాజీ మంత్రి పేర్ని నాని ముస్లిమ్స్ ని అవమానించారు! వెంటనే క్షమాపణ చెప్పాలి!

 మాజీ మంత్రి పేర్ని నాని ముస్లిమ్స్ ని అవమానించారు! వెంటనే క్షమాపణ చెప్పాలి!

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
మాజీ మంత్రి పేర్ని నాని రంజాన్ పండుగ రోజు ముస్లిమ్స్ ని అగౌరపరిచేలా మాట్లాడి నందుకు తీవ్రంగా ఖండిస్తున్నామని జీవీఎంసీ జోన్ టు మధురవాడ 6వ వార్డు పోతిన మల్లయ్యపాలెం పరిధిలోని  రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు గొల్లంగి ఆనంద్ బాబు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ముస్లీమ్స్ ను అగౌరవపరిచేలా, ముస్లిమ్ మత పెద్ద దర్గా పండితులు ఖురాన్ గ్రంధం గురించి, కూళం కుషంగా ముస్లిమ్స్ కు వివరించి చెప్పే, గౌరవం కలిగిన వ్యక్తి గురుంచి, గౌరవం తో మాట్లాడ వలసిన,విషయం మరచి, మాజీ మంత్రి పేర్ని నాని,రంజాన్ రోజున, వారిని అగౌరవపరుస్తూ ఆర్టిస్ట్ అని , అవమానించడం చాలా తప్పు వారికి వెంటనే క్షమాపన చెప్పి, జరిగిన తప్పును, సవరించుకోవాలి అని టీడీపీ రాష్ట్ర బిసి సెల్ ఉపాధ్యక్షుడు ఆనంద్ బాబు గొల్లంగి డిమాండ్ చేశారు. లేకుంటే ఈ వివాదాల ఎమ్ ఎల్ ఏ పేర్ని నాని తోపాటు, అతను ప్రాతినిధ్యం వహిస్తున్న, వైస్సార్ పార్టీని ఆంధ్రలో వుండే ముస్లిమ్స్ తో పాటు వారి సహోదరులు అయిన హిందువులు, క్రిస్టియన్స్ అందరూ వైస్సార్ పార్టీ కి వోట్ వేయకుండా ఓడించి ఆంధ్రప్రదేశ్ నుండి, తరిమికొడతారు కబడ్డార్ పేర్ని నాని అని ఆనంద్ బాబు హెచ్చరించారు. వెంటనే మా సోదరులు అయిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముస్లిమ్స్ కు వెంటనే క్షమాపణ చెప్పండి లేదా నోటి దురద వల్ల మీ పార్టీని మీరే నాశనం చేసే మూలసంక ఉన్న, మూల వ్యక్తులు మీరే అవుతారు జాగ్రత్త అని రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు ఆనందబాబు గొల్లంగి నొక్కి చెప్పారు.