కోరాడ ' సస్పెన్షన్ను ఎత్తివేయాలి...!:లేదంటే రాజీనామాలకు సిద్ధం.

 కోరాడ ' సస్పెన్షన్ను  ఎత్తివేయాలి...!:లేదంటే రాజీనామాలకు సిద్ధం.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
 భీమిలి నియోజకవర్గ టిడిపి సీనియర్ నాయకులు,  మాజీ ఏఎంసీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు ను పార్టీ అధిష్టానం కారణం లేకుండా టిడిపి నుండి సస్పెండ్ చేయడంపై పలువురు సీనియర్ నాయకులు, ఎంపీటీసీలు మండిపడుతున్నారు. ఏ కారణం చేత సస్పెన్షన్ వేటు వేసారో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలో లేనప్పటికీ గత మూడేళ్లుగా నియోజకవర్గంలోని ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల్లో  లక్షలాది రూపాయలు వ్యయం చేసి సేవా కార్యక్రమాలను అతను అతని కుమారుడు కోరాడ  నవీన్ జ్ఞానేశ్వర్ లు తో పార్టీ ఉనికిని కాపాడుకుంటూ వస్తే వారికి ఇచ్చిన బహుమతి ఇదా అని ప్రశ్నించారు. పార్టీ తక్షణమే సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోకపోతే నియోజకవర్గంలో టిడిపి కనుమరుగవక తప్పదని హెచ్చరించారు.  ఒక వ్యక్తి చెప్పిన మాటలకు తలొగ్గి పార్టీ అకారణంగా సీనియర్ నాయకుడిని గుర్తించకుండా  అవమాన  పాలు చేయటం  ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపిటిసి అభ్యర్థులుగా గెలిచిన బంటుబిల్లి అప్పలస్వామి,  దొంతల కనకరాజు, కొట్యాడ రమాదేవి, పడాల అప్పలనాయుడులు మాట్లాడుతూ సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో కోరాడ నాగభూషణరావు అందరికీ ఎంతో  ఆర్థిక సహాయం అందించి మా గెలుపుకు విశ్రాంతి లేకుండా శ్రమించారని అతనికి మేము ఎల్లప్పుడూ విధేయులు గానే ఉంటామన్నారు. అతను చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోమన్నారు. గురుతుల్యులు తో  సమానమైన కోరాడ నాగభూషణరావు పై సస్పెన్షన్ ఎత్తివేయకపోతే తమ పదవులకు, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. దీంతో భీమిలి నియోజకవర్గం లోని తెలుగుదేశం పార్టీలో సెగలు ప్రారంభమయ్యాయని  పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.