సింహాచల దేవస్థానం కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్న భక్తులు.
విశాఖ లోకల్ న్యూస్ :సింహాచలం.
సింహాచలం దేవాలయంలో భక్తులకు ఇబ్బందులు శనివారం ఉదయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు కనీస సదుపాయాలు లేకపోవడంతో భక్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై జనసేన పార్టీ కార్యకర్తలు స్థానిక ఆలయ సిబ్బందికి మరియు పోలీస్ వారికి తెలియజేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని జనసేన పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ కనీసం చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎలాంటి సదుపాయాలు లేవని తాగడానికి నీళ్లు కూడా లేవని జనసేన నాయకులు తెలిపారు. ఇప్పటికైనా దేవాలయ అధికారులు స్పందించి భక్తులకు సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇబ్బందుల గురించి పోలీస్ 100కి తెలియజేయగా పోలీస్ సిబ్బంది ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదని పోలీసు వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో ఈఓ దేవస్థానం లో సౌకర్యాలపై దృష్టి పెట్టాలని జనసేన సైనికులు కోరుకుంటున్నారు..


