స్పందన లో ఇచ్చిన పిర్యాదుకే స్పందన లేదని బింద్రా నగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం.

 స్పందన లో ఇచ్చిన పిర్యాదుకే స్పందన లేదని బింద్రా నగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం.

విశాఖ లోకల్ న్యూస్ :మధురవాడ 

విశాఖ జిల్లా మధురవాడ మిధిలపురి వుడా కాలనీ షిప్ యార్డ్ లే అవుట్ లో బింద్రానగర్ మీదగా స్టేడియం వరకు చేరుకునే 60 అడుగుల రహదారిని గత 3 సంవత్సరాలుగా నిర్మాణం చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని బింద్రానగర్ కాలనీ వాసులు ఆదివారం నాడు ప్లక్ కార్డులతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా స్థానిక కాలనీ వాసి రమేష్ మీడియా తో మాట్లాడుతూ బింద్రా నగర్ లో ఉన్న సమస్యలపై ఉన్నత అధికారులకు దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని స్పందనలో అర్జీ పెట్టుకున్నా కూడా ఎటువంటి స్పందన కూడా ఇప్పటివరకు జరగలేదు. అని అలాగే బింద్రా నగర్ కాలనీ వాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు రాత్రులు కూడా వీధి లైట్లు కూడా లేవు అలాగే డ్రైనేజీ మరియు నీటి సమస్య ఎక్కువుగా ఉంది. వీధి దీపాలు లేక పోవడం వల్ల మహిళలు కూడా రాత్రులు బయటి రావాలంటే భయపడుతున్నారు తాగుబోతులు విచ్చలవిడిగా తిరుగుతూ మహిళల పై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ తెలిపారు .ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని బింద్రా నగర్ కాలనీ వాసులు రమేష్, వెంకట్, సాయి, వీరభద్ర రావు, అపర్ణ తదితరులు అధికారులను వేడుకుంటున్నారు..