జీవీఎంసీ 33వ వార్డు హరిజన వీధి లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతల నిరసన.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం
జీవీఎంసీ 33వ వార్డు హరిజన వీధి లో ఉన్న అంబేద్కర్ బొమ్మ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్లమెంట్ పార్టీ అధికార ప్రతినిధి విల్లూరి డాక్టర్ చక్రవర్తి మరియు 33 వ వార్డు క్లస్టర్ ఇన్‌చార్జ్ విల్లూరి తిరుమలదేవి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి విల్లూరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు,విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శీను,విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ గండి బాబ్జీ ఆదేశాల మేరకు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగిన విషయం లో ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ పై ఐ పి సి 302 టు సెక్షన్ పెట్టి అతనిని వెంటనే అరెస్టు చేసిన ఫిదపా తక్షణమే వారి కుటుంబాని ప్రభుత్వం 50 లక్షలు రూపాయలు నష్టపరిహారం, మరియు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. జగన్ దళితుల పక్షపాతాన్ని వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తూ వుంటారు , ఈ ప్రభుత్వంలో దళిత మహిళలపై అత్యాచారాలు , దళిత పురుషుల మీద హత్యలు చేయించడంలో మొదటి స్థానంలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు . అలాగే హత్య చేసిన వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి కంఠం శెట్టి భాగ్యలక్ష్మి, వార్డు పార్టీ మహిళలు సింగంపల్లి మాధవి, కలిగొట్ల హేమ లక్ష్మి, ఎల్ దుర్గా, హేమలత, మరియమ్మ, జి రాణి, డి శాంతి, తదితరులు పాల్గొన్నారు

