చిడియక్ హిగాసి సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్న ఎన్. చేతన్ కుటుంబానికి 50,000 రూపాయల సహాయం.

 చిడియక్ హిగాసి సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్న ఎన్. చేతన్ కుటుంబానికి 50,000 రూపాయల సహాయం.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం 

విశాఖ జీవీఎంసీ పరిధి 77 వ వార్డ్ నమ్మిదొడ్డి ప్రాంతానికి చెందిన *ఎన్. చేతన్* (4సంవత్సరాలు) *చిడియక్ హిగాసి సిండ్రోమ్* అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీని చికిత్స నిమిత్తం 20 లక్షల రూపాయలు వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన,శ్రీ మురళీ కృష్ణ సేవా సంఘం - మొల్లివానిపాలెం గ్రామం తరపున 50,000 రూపాయలను వారి తల్లిదండ్రులుకు అందించి , నిరుపేద కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు ఉరుకూటి.సింహాద్రి, ప్రధానకార్యదర్శి మొల్లి. పెంటిరాజు,నమ్మి. సింహాద్రి,నమ్మి.రమణ,మొల్లి. అప్పలనాయుడు,నమ్మి. చందర్రావు,మొల్లి.రమణ, ఎలమంచిలి శ్రీను,నమ్మి. తిరుపతిరావు,మొల్లి.రవి,మొల్లి. వెంకటేష్,నమ్మి.శ్రీను, తదితరులు పాల్గొన్నారు.