ప్రజాతీర్పుతో గెలిచిన కార్పొరేటర్లకు విలువ లేదా.? కార్పొరేటర్ పిల్లామంగమ్మ.

 ప్రజాతీర్పుతో గెలిచిన కార్పొరేటర్లకు విలువ లేదా.? కార్పొరేటర్ పిల్లామంగమ్మ.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి




రాష్ట్రంలో అధికారంలో ఉంటే గెలిచిన కార్పొరేటర్కి తెలియకుండానే అధికారపార్టీ అని సచివాలయ సిబ్బందితో కలిసి చెత్త డబ్బాల పంపిణీ చేసిన వైస్సార్సీపీ నాయకులు.


ప్రోటోకాల్ విస్మరించారని సచివాలయం సిబ్బందిని నిలదీసిన కార్పొరేటర్ పిల్లామంగమ్మ.

సచివాలయ సిబ్బంది అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.కౌన్సిల్ సమావేశంలో జి.వి.ఎం.సి కమీషనర్ కు ఫిర్యాదు చేస్తాం.

జీవీఎంసీ పంపిణి చేస్తున్న ప్లాస్టిక్ డబ్బాల పంపకం వివాదాలకుదారితీసింది.నగరంపాలెం వద్ద గల 61సచివాలయంలో ఈ ప్లాస్టిక్ డబ్బాల పంపిణీని స్థానిక వైఎస్సార్సీపి నాయకులు సచివాలయం సిబ్బంది పాల్గొని పంపిణి చేపట్టారు.
అయితే 7వ వార్డు కార్పొరేటర్ గా ఉన్న తనకు ఈ విషయం ఎందుకు తెలియచేయలేదని పిళ్లామంగమ్మ సచివాలయ సిబ్బందిని ప్రశ్నించారు.

అనంతరం జీవీఎంసీ జోన్ 2 కార్యాలయం లో సచివాలయ సిబ్బంది పని తీరుపై జోన్ 2కమీషనర్ కి పిర్యాదుచేసారు.