ఇందన ధరలు తగ్గించిన మోదీ కి ధన్యవాదములు తెలిపిన భారతీయ జనతాపార్టీ విశాఖ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి,పి.వి.వి.ప్రసాదరావు.

 ఇందన ధరలు తగ్గించిన మోదీ కి ధన్యవాదములు తెలిపిన భారతీయ జనతాపార్టీ విశాఖ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి,పి.వి.వి.ప్రసాదరావు.

విశాఖ లోకల్ న్యూస్:విశాఖపట్నం ప్రతినిధి


భారతీయ జనతాపార్టీ విశాఖ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి,పి.వి.వి.ప్రసాదరావు పట్నాయక్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలపై భారత ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించిన మన భారత ప్రధాని నరేందర్ మోడీ జీ సూచనల మేరకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం  ఒక్కసారిగా పెట్రోల్ పై లీటర్ కు 9:50 రూపాయలు, డీజిల్ పై 7/- రూపాయలు తగ్గించీ మరొక్కసారి మన భా.జ.పా. పరిపాలనా సౌలభ్యాన్ని, తెలియచేసింది అని సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రంలో భా.జ.పా. ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించడం ఇది రెండో సారి అని గత నవంబర్ నెలలో పెట్రోల్ పై 5/- రూపాయలు, డీజిల్ పై 10/- రూపాయలు బీజేపీ ప్రభుత్వం తగ్గించి రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ పై వసూళ్లు చేస్తున్న పన్నులు కొంతవరకూ తగ్గించాలని భారత ప్రధాని నరేందర్ మోడీ జీ సలహా ఇచ్చారు అనీ,బిజేపి అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నీ ప్రధాని సలహాలు మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాయనీ,కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వై.కా.పా. ప్రభుత్వం వసూళ్లు చేస్తున్న వ్యాట్ ను కనీసం ఒక్క రూపాయి కూడా తగ్గించలేదనీ పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ అన్నారు. భా.జ.పా. అధికారంలో ఉన్న సుమారు 15 రాష్ట్రాలు ప్రధానమంత్రి సూచనలు మేరకు తమ రాష్ట్ర వ్యాట్ పన్నులను సుమారు 5 వరకూ తగ్గించాయని, అంతేకాదు కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో మన ఆంధ్ర కంటే సుమారు 18/- రూపాయలు లు పెట్రోల్ డీజిల్ ధరలు తక్కవనీ, సందేహం ఉంటే గూగుల్ లో యానాంలో పెట్రోల్ డీజిల్ ధరలు అని వెతికితే మనకు నిజాలు తెలుస్తాయి అని అన్నారు. భారతీయ జనతాపార్టీ తరపున మేము వై.కా.పా. ప్రతినిధులను ఒకటే కోరుతున్నామని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వలే రాష్ట్ర వై.కా.పా. ప్రభుత్వం కూడా వసూళ్లు చేస్తున్న పన్ను లో కనీసం ఒక్క 5/- రూపాయలు అయినా తగ్గించమని డిమాండ్ చేస్తున్నామన్నారు.