సి ఎస్ సి గ్రామీణ్ ఈ స్టోర్ ప్రారంభించిన 7వ వార్డ్ కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ.

 సి ఎస్ సి గ్రామీణ్ ఈ స్టోర్ ప్రారంభించిన 7వ వార్డ్ కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి

జోన్ 2 మధురవాడ వామ్బెకాలనీ (సి ఎస్ సి) గ్రామీన్ ఈ స్టోర్ లో రెనో కార్ బుకింగ్ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా 7వ వార్డ్ కార్పొరేటర్ పిల్ల మంగమ్మ విచ్చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంగమ్మ మాట్లాడుతూ  ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన గ్రామీణ్ ఈ స్టోర్ లో రెనో కార్లు తక్కువ బడ్జెట్లో ఎక్కువ సదుపాయలతో అందుబాటులో ఉన్న కార్లు సమాన్యులకు ఉపయోగించుకునేవిధంగా ఉండాలని ఆలోచనతో విశాఖపట్నం లో సి ఎస్ సి మీసేవ సెంటర్ మధురవాడ వామ్బెకాలనీ ఆపరేటర్ శ్రీహరి సెంటర్ లో విశాఖపట్నం జిల్లాకి బుకింగ్ సెంటర్ ప్రారంభించారని శ్రీహరి గ్రామీణ్ ఈ స్టోర్లో కార్ కొనటం వల్ల షో రూమ్ లో కొనే ధర కన్నా తక్కువ ధరకు వస్తుందని ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు.సి ఎస్ సి మీసేవ ఆపరేటర్ శ్రీహరి మాట్లాడుతూ( సి ఎస్ సి )మీసేవ లో స్వయం ఉపాధి కింద వికలాంగుల లకు ఉద్యోగాలు లేక వయసయ్యి ఉపాధిలేని మాకు ఈ సెంటర్ నడుపుకునే అవకాశం కల్పించిన సి ఎస్ సి డిస్ట్రిక్ మేనేజర్ సంతోష్, మీసేవ ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్, అశోక్, ఏపీ ఆన్లైన్ జోనల్ మేనేజర్ సత్యనారాయణ, మీసేవ యూనియన్ విశాఖ సెక్రెటరీ నాగు కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ సెక్రటరీ పిళ్ళా వెంకటరావు,పౌరసేవా సంఘం అధ్యక్షులు నాగోతి సూర్యప్రకాశరావు, కానూరి అచ్యుత్ రావు, టీడీపీ 7వవార్డ్ మహిళా అధ్యక్షులు నోడగల భవాని, నమ్మి రమణ,బ్లాక్ అండ్ వైట్ టీవీ పిళ్ళా విజయ కుమార్,రెనో కార్ సేల్స్ ఆఫీసర్ సునీల్ కుమార్, ఉదయ్, శలీం పాల్గొన్నారు.