నేటి నుండి షాప్ వేసవి క్రీడ శిక్షణ శిబిరం లు ప్రారంభం.

 నేటి నుండి షాప్ వేసవి క్రీడ శిక్షణ శిబిరం లు ప్రారంభం.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి

స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు 
చంద్రంపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో బుధవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి.
బాస్కెట్బాల్, బాక్సింగ్, టైక్వాండో ,కబడి ,కోకో, వాలీబాల్ ,అథ్లెటిక్స్, లలో నేటి నుండి నెల రోజుల పాటు ప్రతిభగల  క్రీడా శిక్షకు ల శిక్షణలో ఈ శిక్షణా శిబిరాలు కొనసాగనున్నాయి.
డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ విశాఖపట్నం పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సెట్విన్ సీఈఓ నాగేశ్వరరావు పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సిఐ రవి కుమార్ జీవీఎంసీ జోన్ టు జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము చంద్రంపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ ఇన్ చార్జ్ హెచ్ఎం రాము తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడా శిబిరాలను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ టైక్వాండో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ఆనందరావు మారుతి బాక్సింగ్ క్లబ్ వ్యవస్థాపకులు వంకాయల మారుతీ ప్రసాద్ ల అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లో ఇంటర్నేషనల్ యోగ అండ్ ఫిట్ నెస్ ట్రైనర్ బి జగదీష్, షాప్ బాక్సింగ్ కోచ్ వి సాయి కుమార్ బాస్కెట్ బాల్ కోచ్ జగదీష్ టైక్వాండో కోచ్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వేసవి సెలవులు వృధా చేయకుండా  తమకు నచ్చిన క్రీడా అంశంలో తర్ఫీదు పొంది ప్రావీణ్యతను సంపాదించాలని కోరారు.
అందుబాటులో ఉన్న ఈ ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.