మజ్జివలస గ్రామంలో బాల్య వివాహాలు నియంత్రణ పై అవగాహన సదస్సు

 మజ్జివలస గ్రామంలో  బాల్య వివాహాలు నియంత్రణ పై అవగాహన సదస్సు .

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి

మజ్జివలస గ్రామంలో అంగన్వాడీ 2 కేంద్రంలో గ్రామ సర్పంచ్ తుపాకుల ఆదిలక్ష్మి  ఆధ్వర్యంలో బాల్య వివాహాల మీద ,  దిశ యాప్ మీద బెల్ట్ షాప్ పై ఆవాహన సదస్సు జరిగింది.ఈ సందర్భంగా తుపాకుల ఆదిలక్ష్మి మాట్లాడుతూ  నేటి నవ నూతన సమాజంలో  మారు మూల గ్రామాల్లో బాల్య వివాహాలు చేస్తున్నారని దీనికి కారణం అవగాహన లేకపోవడం , నిరక్షరాస్యత వీటిని రూపుమాపాలంటే ఇలాంటి సదస్సు లు నిర్వహించాలని 18 సం నిండిన తరువాత ఆడపిల్ల లకు వివాహాలు జరిపించాలని , అలా కాకుండా చిన్న వయసులో వివాహం చేసినట్లయితే ఆడపిల్లల్లో శారీరికంగానూ మానసికంగానూ అభివృద్ది అనేది జరగకపోగా , చిన్న వయసులో గర్భం దాల్చినచో గర్భస్రావం, రక్తస్రావం, రక్తహీనత ఇలా పలు రకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని , ఒక్కోసారి ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు అని కనుక బాల్య వివాహాలు కు దూరంగా ఉండండి అలాగే మహిళలకు దిశ అప్ శ్రీరామ రక్ష ,బెల్ట్ షాప్ లు గ్రామంలో ఉంటే యువతరం పక్కదారి పడుతోంది అవి చేసేడి వారు మీ ప్రాంతంలో ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేయాలని మాట్లాడటం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమెన్ పోలీస్ షేక నజియా,వి.ఆర్.ఓ వెంకటరావు, ఏ.ఎన్.ఎమ్ గౌరి, అంగన్వాడీ కార్యకర్త విజయలక్ష్మి ఆశా వర్కర్ మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.