అనర్దులా ఆకలి తీర్చడం మా సంస్థల లక్ష్యం :
విశాఖపట్నం ప్రతినిధి
మాతృభూమి సేవా సంఘం మరియు హెల్పింగ్ హేండ్స్ హిజ్రా*అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా విశాఖపట్నం జిల్లా గాజువాక పరిసర ప్రాంతాలలో ఉండే నిరుపేద నిరాశ్రయ అన్నార్థులు కోసం ఏర్పాటు చేసిన నిత్య అన్నదానం కార్యక్రమం ఈ రోజు మాతృభూమి సేవా సంఘం సభ్యులు పి. నరేష్ కుమార్ పుట్టినరోజు సందర్బంగా 50మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో రాజుగోవ,సురేష్ తదితరులు పాల్గున్నారు. నిత్య అన్నదానం కార్యక్రమం నిర్వాహకులు దవడ కొండబాబు, ఇప్పలవలస గోపాలరావు మాట్లాడుతూ ఎవ్వరు ఆకలి తో బాధపడకూడదు అనే ఉదేశ్యంతో మా సంఘం సభ్యులు గుర్తించిన అన్ని ప్రాంతాలలో అన్నార్థులు ఆకలి తీర్చడం కోసం త్వరలో విజయనగరం, విశాఖపట్నం జిల్లా శ్రీహరిపురం, రైల్వే స్టేషన్ ప్రాంతాలలో మా మిత్రులు, శ్రేయోభిలాషులు,దాతలు సహకారం తో నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని తెలియచేసారు.

