మహానాడులో భీమిలి సమస్యలపై నివేదిక.!ఇంచార్జ్ కోరాడ రాజబాబు స్పష్టికరణ

 మహానాడులో  భీమిలి సమస్యలపై నివేదిక...!ఇంచార్జ్ కోరాడ రాజబాబు స్పష్టికరణ.

విశాఖపట్నం ప్రతినిధి

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో  భీమిలి నియోజకవర్గం సమస్యలపై ఒక నివేదిక తయారుచేసి జిల్లా కమిటీ ద్వారా అధినేత నారా చంద్రబాబు నాయుడికి అందజేస్తామని  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ కోరాడ రాజబాబు తెలియజేసారు.

            భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గలో ఉన్న సీనియర్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ   తెలుగుదేశం పార్టీ వ్యవస్తాపకులు  నందమూరి తారక రామారావు జయంతిని పురష్కరించుకొని ప్రతీ ఏడాది నిర్వహిస్తున్న కార్యక్రమం మహానాడు అని అన్నారు.  పార్టీ ఆవిర్భావం నుండి ఈ అనవాయితీ వస్తుందని,  ఈ ఏడాది ఒంగోలులో నిర్వహించాలని ఆదినాయకత్వం నిర్ణయించిన పిదప నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని కోరాడ రాజబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  అదేవిదంగా మహానాడు వేదికగా భీమిలి నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను ఒక నివేదిక రూపంలో తయారుచేసి అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని వెళ్తామని అన్నారు.  భీమిలి నియోజకవర్గంలో 9  కార్పొరేషన్ వార్డులు, 3 మండలాలు ఉన్నాయని  అన్నారు.  ప్రతీ మండలంలో ఉండే మేజర్ సమస్యను విశదీకరిస్తామని అన్నారు.
ఈ  కార్యక్రమంలో  కార్పొరేటర్లు మొల్లి హేమలత, మహిళా నాయకులు గోడి అరుణ, కురిమిన లీలావతి, బోయి రమాదేవి, ఎంపిటిసి కోరాడ రమణ, నాయకులు వాట్రాసి అప్పలరాజు, పిట్టా సురేష్, దాసరి శ్రీనివాస్, గొల్లంగి ఆనందబాబు, చోడిపిల్లి సాయి జయ శంకర్, సిద్దార్ధ వర్మరాజు  ఇతర నాయకులు పాల్గొన్నారు.