ఏంటీ " చెత్త " విధానం❓️పిట్ట సురేష్
పార్లమెంటరీ సెక్రటరీ
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం
జీవీఎంసీ లో రేపు జరగనున్న కౌన్సిల్ సమావేశంలో ప్రజల పై వేసిన చెత్త పన్ను పై నిర్ణయం తీసుకోబోతున్నారు. అసలు చెత్తకు పన్ను ఎందుకు కట్టాలి, ప్రజలు కట్టే ఆస్తి పన్ను లేదా ఇంటి పన్ను లోనే మునిసిపల్ సిబ్బంది అందించే పౌర సేవలకు చార్జీలు ఉంటాయనేది మనందరికీ తెలిసిన విషయం. మనం చెల్లించే ఇంటిపన్నుతో లైబ్రరీ, లైటింగ్ ,శానిటేషన్, స్పోర్ట్స్, ఫైర్ ఇలాంటి అనేక పౌర సేవల కోసం వినియోగించడానికి. మరి అటువంటప్పుడు మరలా చెత్త పన్ను అని కొత్తగా ఎలా వేస్తారు.
" పాత పని - కొత్త పన్ను" అనే చందంగా వుంది ఈ పథకం. కొన్నాళ్ల కిందట మన ఇల్లు, వాకిళ్ళు శుభ్రం చేసేటప్పుడు వచ్చిన చెత్తను ఒక దగ్గర పోగు చేసి కొంతకాలం తర్వాత ఆ "పెంట" ను రైతులకు వ్యవసాయ భూముల్లో పంటలకు ఎరువు లేదా కంపోస్టు గా వినియోగించడానికి అమ్మేవారం.మరి ఇప్పుడు...
క్లాప్ ( క్లీన్ ఆంధ్రప్రదేశ్) అని పేరు పెట్టి ఇంటింటి నుండి సేకరించిన చెత్తను పవర్ ,ఎరువుల తయారీ సంస్థలకు కంపెనీలకు అమ్మడం.చెత్తను అమ్మడం వలన ప్రభుత్వానికి ఆదాయమే కదా. మరి కంపెనీలకు ఇచ్చే చెత్తను నివాసాల నుండి సమీకరిస్తే ఆ చెత్తకు యూజర్ చార్జీల పేరిట పన్ను అడగటం ఎంతవరకు సమంజసం.
సిటీ లో కొన్ని ప్రాంతాలు మినహా శానిటేషన్ పట్ల ప్రజలు సంతృప్తిగా లేరు. కొంతమంది కి మీరు విధించే యూజర్ చార్జీలు సంవత్సరానికి వారి ఇంటి పన్ను కన్నా చెత్త పన్నే ఎక్కువగా ఉంటుంది. కొన్ని అభివృద్ధి చెందిన కాలనీలను దృష్టిలో పెట్టుకొని వేసిన ఈ చెత్త పథకం పేదవాడికి భారమే అవుతుంది.
ఇప్పటికీ జీవీఎంసీ పరిధిలో చాలా చోట్ల నుండి శానిటేషన్ పై ఫిర్యాదులు నిరంతరం వస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే ప్రజల నుండి మా వీధి రోడ్లు, కాలువలు శుభ్రం చేయడం లేదని, పేరుకుపోయిన చెత్త ను ఫిర్యాదు చేస్తే గాని తీయడం లేదని, ఫిర్యాదులు చేసినా వస్తాం, చేస్తామనే సమాధానాలు అధికారులు చెబుతున్నారనే అనుభవాలు అందరికీ విధి తమే.
అధికారుల వద్ద నుండి వచ్చే ఏకైక సమాధానం పారిశుద్ధ్య "కార్మికుల కొరత" కారణంగానే పూర్తిస్థాయి సేవలో ఇవ్వలేకపోతున్నాం అనే సమాధానంతో ప్రజలు ఎన్నాళ్ళు సర్దుకోవాలి.
ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులైన గౌరవ సభ్యులు అందరూ రేపు జరగనున్న సమావేశంలో గ ప్రజలందరికీ వ్యతిరేకమైన "చెత్త పన్ను" పథకం రద్దు దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు

