కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టినందుకు చేసిన దహనకాండకు నిరసన.

 కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టినందుకు చేసిన దహనకాండకు నిరసన.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి 

రాష్ట్ర ప్రభుత్వం కోనసీమ జిల్లాకు నవ భారత రాజ్యాంగ నిర్మాత అయిన డా.బాబా సాహేబ్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని జీర్ణించుకోలేని కొంత మంది అగ్రవర్ణ కులాలకు చెందిన వారు కోనసీమ జిల్లా లో అల్లర్లు సృష్టించి బస్సులు తగులబెట్టి పోలీస్ లపై మంత్రి విశ్వరూప్ ఇంటిని తగులబెట్టి  దాడులు చేసిన హేయమైన చర్యలకు బుధవారం తగరపువలస కూడలి లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహం కి పూల మాలలు వేసి నినాదాలు పలికారు.అనంతరం మీడియా తో దళిత నాయకులు భాగం స్వాతి సుధాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వర్గానికో ఒక ప్రాంతానికో నాయకుడు కాదని భారత రాజ్యాంగం రాసి భారత పాలన యంత్రాంగం నడిచేందుకు దశ దిశ నిర్థేశకుడైన గొప్ప ప్రపంచ మేథావి అని ఇదే ఆంద్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు జిల్లా వైయస్సార్ జిల్లా యన్టిఆర్ జిల్లా పొట్టిశ్రీరాములు జిల్లా అని పేర్లు పెట్టినప్పుడు ప్రతీ  దళితుడు సంతోషం వ్యక్తం చేశారే తప్పా ఎలాంటి ఖండనలు చెయ్యలేదు అలాంటిది ఒక జిల్లా కు అంబేద్కర్ పేరు పెడితే మీకేందుకు ఇంత కుల వివక్ష దీనిని మేము ఖండిస్తున్నాం. దళితులు విషయంలో ఎవరైనా అన్యాయం చెస్తే మేము అండగా ఉంటాం అనే రాజీకీయ పార్టీలైన టిడిపి జనసేన భీజేపి అన్ని పార్టీలు దీనిపై మీ వైఖరిని తెలిపి మాకు అండగా ఉండాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కి తోడ్పాటు ఇచ్చి కొంత మంద్రి విద్రోహ శక్తుల హేయమైన చర్యను ఖండించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో దళిత నాయకులు ఉప్పాడ నాగేశ్వరరావు, పందిరి విజయ్, యువ నాయకులు, అంబేద్కర్ వారసులు పాల్గొన్నారు