5వ వార్డులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
.
ముఖ్య అతిథిగా విచ్చేసి పూజలు నిర్వహించిన 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత.
మధురవాడ: జీవీఎంసీ 5వ వార్డ్ పరిధిలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొట్టవానిపాలెం,నగరంపాలెం, స్వతంత్రనగర్ లో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం, అభయ ఆంజనేయ స్వామి ఉపాఆలయం,సాయిరామ్ కాలనీ,రాజీవ్ గృహకల్ప (మారికవలస),శ్రీలక్ష్మీనగర్ ల లో గల ఆలయాల లో జరిగిన కార్యక్రమాలకు కార్పొరేటర్ మొల్లి హేమలత,రాష్ట్ర టిడిపి బీసీ సెల్ కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా బొట్టవానిపాలెం, స్వతంత్రనగర్,సాయిరామ్ కాలనీ,శ్రీలక్ష్మీనగర్ లలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సాయిరామ్ కాలనీ అన్నసంతర్పణ కార్యక్రమంలో టిడిపి భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త కోరాడ రాజబాబు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈసందర్భంగా కార్పొరేటర్ మొల్లిహేమలత మాట్లాడుతూ నేడు ఎంతో పర్వదినం అని శ్రీహనుమాన్ జయంతి సందర్భంగా వార్డులోని ప్రముఖ దేవాలయాల్లో స్వామివారిని దర్శించుకోవడం,అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం,శ్రీరాములవారికి ప్రియ ఆప్తుడు అయిన ఆంజనేయస్వామి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టమని,నాపూర్వ జన్మ సుకృతం అని అన్నారు. ఆలయాలకు వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యుల ఏర్పాట్ల తీరును అభినందించారు.వార్డు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆంజనేయస్వామి వారిని కోరుకుందాంఅన్నారు.ఈ కార్యక్రమంలో బొట్టవానిపాలెం యువత,గ్రామపెద్దలు, నగరంపాలెం యువత,గ్రామపెద్దలు, స్వతంత్రనగర్ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ,శ్రీలక్ష్మీదేవి అమ్మవారి ఆలయ కమిటీ, నీలయ్య బ్రదర్స్, బొడ్డేపల్లిరంగ, ఆదిలక్ష్మి,దేవి,కోరాడరాజు, కృష్ణవేణి,పెద్దరమణ, తదితరులు పాల్గొన్నారు.


