నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్.టి.ఆర్ శత జయంతి వేడుకలు.

 నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్.టి.ఆర్ శత జయంతి వేడుకలు.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు,నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షుడు తుపాకుల సంతోష్ రాజా ఆధ్వర్యంలో సింగనబంద పంచాయతీ కృష్ణ రాజు పేటలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ సరగడ అప్పారావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.పార్టీ స్ధాపించిన అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయడం కాకుండా ఆడపిల్లలుకు కూడా ఆస్తిలో హక్కు కల్పించిన మహనీయుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు హరీష్,రవి,అధికార ప్రతినిధి కొయ్య రమేష్ రెడ్డి, కార్యదర్శి కోరాడ రాంబాబు,కార్య నిర్వాహక కార్యదర్శి సుందర్ సింగ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అప్పలరెడ్డి,రవి చరన్,సతీష్,మండల బీ.సీ సెల్ అధ్యక్షుడు జి.కె యాదవ్, వార్డు మెంబర్ రాము,అప్పల రమణ,కర్రి రమణ ,కిలారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.