జీ వీ ఎం సీ 1,2 వార్డులలో స్వర్గీయ నందమూరి తారకరామారావు 100 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

 జీ వీ ఎం సీ 1,2 వార్డులలో స్వర్గీయ నందమూరి తారకరామారావు 100 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి

2 వ వార్డు కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి మరియు 1వ వార్డు టిడిపి అధ్యక్షులు తమ్మిన సూరిబాబు అధ్వర్యంలో బైపాస్ రోడ్డులో గల ఎన్ టీ ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు తరువాత రాజవీది లో గల ఎన్ టీ ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి కేక్ కట్టింగ్ చేశారు. అలాగే బ్యాంక్ కాలనీ లో ఎన్ టీ ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాళ్ళ వలస లో వెంపాడ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న మన కుటుంబం చారిటబుల్ ట్రస్టు లో అనాధ పిల్లల కు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగినది. అలాగే రాత్రి పిల్లలకు బొజనం ఏర్పాటు చేయడం జరిగినది. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్ టి ఆర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  1,2 వ వార్డు టిడిపి నాయకులు రెండో వార్డ్ జనరల్ సెక్రెటరీ పిట్ట వెంకట రావు ,చెట్ల రమణ,చెట్ల గురుమూర్తి, చిలక నరసింహారావు, దేవుళ్ళు, నరవ రామారావు , జీరు సత్యం, జీరు ఈశ్వరరావు, ఎరెయ్య రెడ్డి, అప్పల రెడ్డి మాస్టర్ , గోపి ,బార్ల రాయలు,బార్ల సూర్య కోలా గోపి  నారాయణ మరియు కార్యకర్త లు పాల్గొన్నారు.