మే 9న చలో అమరావతి కి కి తరలిరావాలని సిపిఐ గోడపత్రిక ఆవిష్కరణ.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
ప్రధానినరేంద్ర మోడీ జగన్ రెడ్డి పెంచినధరల నియంత్రణకు సమరం చేద్దాం ప్రజలు కదిలి రండి సిపిఐ పిలుపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన డీజిల్ పెట్రోలు నిత్యవసర వస్తువుల ధరలు పెంచిన ఇంటి పనులు చెత్తను కరెంటు చార్జీలను రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మే 9న చలో అమరావతి ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకి అక్కయ్యపాలెం రైతు బజార్ వద్ద చలో అమరావతి గోడపత్రిక ఆవిష్కరణ జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నగర కార్యదర్శి మాట్లాడుతూ మోడీ జగన్ రెడ్డి పోటీపడి పెంచిన వంట నూనె డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలు అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలు ఇంటి పన్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ప్రజాగ్రహానికి పాలకులు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు మే 9న చలో అమరావతికి ప్రజలు కార్మికవర్గం తరలించి ప్రభుత్వం మెడలు వంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు పేదలపై భారాలు వేసి బడాబాబులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తున్న స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు జూదం చూస్తున్నారని మండిపడ్డారు ఎలక్షన్ వచ్చినప్పుడు మాకు ఓటేయండి ఇ మీకు మేలు చేస్తామని వీధి వీధి లో వాడవాడలా తిరిగి ప్రజా ప్రతినిధులు ధరలు ఆకాశాన్నంటే మీరెక్కడున్నారో చెప్పాలని ప్రజలు ప్రశ్నించాలి అధికారపక్షం ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్పా చేసేది ఏమీ లేనట్టు వారిది ఉన్నాయని మండిపడ్డారు ధరల నియంత్రణకు జగన్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ధరల పెరుగుదల ఏ విధంగా పోరాడాలని అప్పుడు ప్రజలు నమ్ముతారని ప్రజలువిశ్వశాంతి కోల్పోతారని హెచ్చరించారు డీజిల్ పెట్రోల్ ధరల పై వేసిన పనులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లో సిపిఐ నాయకులు రవి కృష్ణ ఆటో చిల్లర వర్తక సంఘ నాయకులు పి సాయి కుమార్ ఆర్ జి సూర్యారావు ఎంపీ ఐడియా జి శ్రీనివాస్ మహాలక్ష్మి నాయుడు ఎం రమేష్ కె స్వతంత్ర కుమార్ నూకరాజు సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఇట్లు జి వామనమూర్తి సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు.

