జోన్ 2 లో చిన్న రోడ్డు లో భారీ నిర్మానాలు. ఏమి జరిగిన పట్టించుకోని జీవీఎంసీ ఏసీపీ సారూ?

జోన్ 2 లో చిన్న రోడ్డు లో భారీ నిర్మానాలు. ఏమి జరిగిన పట్టించుకోని జీవీఎంసీ ఏసీపీ సారూ?.......

ప్లాన్ లో కనిపిస్తున్న రోడ్లు ఫీల్డ్ లో కనిపించవు.....


జోన్ 2 లో స్థలంలేకపోయిన   ఎల్ టి పి గీసిందే ప్లాన్...

విశాఖ జిల్లా మధురవాడ జివియంసి   జోన్ 2 కార్యాలయం పరిది 6 వ వార్డు లో టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టానుసారముగా బారీ భవంతులకు లంచాల మత్తులో అనుమతులు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది.   వివరాలోకి వెళ్తే కారుషెడ్ జంక్షన్ అంభిక స్వీట్స్ వెనుక  మూడు అడుగుల రోడ్డు లో మూడు అంతస్థుల బారీ నిర్మాణమునకు  ఎల్ టి పి లు  భవన యజమానుల దగ్గర బారీ ముడుపులు తీసుకొని భవన యజమానులకు అనుకూలంగా ప్లాన్ తయారు చేస్తే వాటిని టౌన్ ప్లానింగ్ అధికారులు తగుదునమ్మ అంటు ప్లాన్ అప్రువల్ కి  సిస్టమ్ లో అప్లోడ్ చేసేస్తున్నారు. ఈ నిర్మాణం  గురించి సచివాలయం   సిబ్బంది ని అడుగగా  మూడు అంతస్థుల నిర్మాణానికి ముందు ఉన్న స్వీట్ షాపుని ఖాళీ స్థలమని, ప్రక్కన  సోనోవిజన్ షాపింగ్ మాల్ తొమ్మిది మీటర్ల రోడ్డు ఉన్నట్లు ప్లాన్ లో  ఉందని కట్టు కల్పిత కధలు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.  అలాగే అదే సర్వీసు రోడ్డు కొమ్మాది జంక్షన్ బాబాయ్ హోటల్ వెనుక ఆరడుగుల రోడ్డు లో 15 సంవత్సరముల  పాత నిర్మాణం పైన మూడు అంతస్థుల భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వడం జరిగింది భవన యజమాని  పాత నిర్మాణం పైన ఆయనకు నమ్మకం ఎక్కువ ఉంటుంది కానీ పాత భవంతి  ఎంత బలమైనది అనేది టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్దారణ చేసి ప్లాన్ ఇస్తే బాగుంటుందని చూసే ప్రజలు బహిరంగముగా విమర్శలు చేస్తున్నారు.  మధురవాడ  సర్వీసు రోడ్డు పక్కన చిన్న చిన్న సందు రోడ్లలో   ఉన్న బారీ భవంతులకు అనుమతులు ఇవ్వడం వాటిని భవిష్యత్తులో అద్దెలకు ఇస్తే రోడ్డులు  పెద్దగా లేని ఆటోలు కూడా దూరని  భవంతులలో అద్దెకు నివసించు మద్య తరగతి ప్రజలు ఫైర్ ఎక్సిడెంట్ లు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రమాదాల బారిన పడి ప్రాణ నష్టము జరిగితే బాధ్యులు భవన యజమానుల లేక కాసులకక్కుర్తి పడి ప్లాన్ ఇచ్చి జేబులు నింపుకుంటున్న టౌన్ ప్లానింగ్  అధికారుల ఎవరని స్థానికులు విమర్శలు చేస్తున్నారు.