అస్తవ్యస్త విధానాలతో అప్పుల ఊబిలోకి రాష్ట్రo...!
విశాఖ లోకల్ న్యూస్: భీమిలి
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఆవేదన
అప్పులు చేస్తేనేగాని పరిపాలన సాగదు అన్నట్లు తయారయింది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్టo పరిస్థితి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టెక్కలి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు.
భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గంటా నూకరాజు మాట్లాడారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సంక్షోభం దిశగా పయనిస్తుందని అన్నారు. అప్పులు చేస్తేనే గాని పూట గడవదు అన్నట్లు రాష్ట్రం దివాళా దిశగా ఉందని అన్నారు. అప్పులు అభివృద్ధి కోసం చేయాలని, అప్పులు తీర్చడానికి, వడ్డీలు కట్టడానికి మరలమరలా అప్పులు చేయవలసి వస్తుందని అన్నారు. ప్రస్తుతం శ్రీలంకలో ఉండే ఆర్ధిక సంక్షోభం పరిస్థితులే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నాయని గంటా నూకరాజు అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని రకాల అప్పులు కలిపితే రూ. 7.85 లక్షల కోట్ల రుణభారం ఉందని, ఇది ప్రస్తుత మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి పెను సవాలని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్పు కాదని, ఆదాయ వనరులు సమకూర్చే మార్గాలు అన్వేషించకుండా కేవలం అప్పులు మీద ఆధారపడి పాలన చేయడం రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు. అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళుతుందని అన్నారు. స్థోమతకు మించి అప్పులు చేయడం, ఒక అప్పు తీర్చడం కోసం మరొక అప్పు చేయడం, పెట్టుబడులపై దృష్టి పెట్టక పోవడం, దశదిశ లేని ఆస్తవ్యస్త పాలన కారణంగా రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించిందని గంటా నూకరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రం ఒకప్పటి బీహార్ గా మారే ప్రమాదం ఉందని వాపోయారు. గత ఆర్థిక సంవత్సరం అసలు - వడ్డీ చెల్లింపు కోసం రూ. 64 వేల కోట్లు ఖర్చు చేశారని, రాష్ట్ర సొంత ఆదాయం రూ. 57,408 కోట్ల రూపాయలని, పన్నుల ద్వారా కేంద్రం నుండి వచ్చేది కేవలం రూ. 24,461 కోట్ల రూపాయలని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి నిధులు ఎలా సమకూర్చుతారని ప్రశ్నించారు. తలకు మించిన అప్పులు చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన పెనుభారం మోపవలసి వస్తుందని గంటా నూకరాజు అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తి మీద 1లక్ష 8వేల రూపాయలు అప్పు ఉందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళలో ఒక్క కొత్త కంపెనీ రాష్ట్రానికి రాలేదని, ఉన్నవి పోవడం తప్ప అని అన్నారు. అలాంటప్పుడు రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ నుండి తెస్తారని గంటా నూకరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గొప్పలకు పోయి ఆదాయ వనరులు సమకూర్చకుండా రాష్ట్రాన్ని దివాళా తీయకుండా పాలకులు ముందు చూపుతో, సమన్వయంతో ఆలోచించాలని గంటా నూకరాజు హితవుపలికారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 195 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని వాటి అభివృద్ధి కోసం ఎన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని అడిగారు. కొన్ని కార్పొరేషన్లకు రెండేళ్లు పదవి పూర్తయిందని, కనీసం ఒక పని కూడా చేయలేని విధంగా కార్పొరేషన్లు ఉన్నాయని అన్నారు. రాజకీయాలకోసం కార్పొరేషన్లు తప్ప ఉపాధి అవకాశాలకు ఎటువంటి అవకాశం లేని సంస్థలుగా అవి చరిత్రలో మిగిలిపోతాయని, దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అని గంటా నూకరాజు అన్నారు.