కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ ధరల సవరణ..పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు.
భూముల మార్కెట్ ధరలు సవరణకొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో భూముల మార్కెట్ ధరలను సవరించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, జిల్లా కేంద్రాల సమీప ప్రాంతాల్లోని భూముుల విలువను ఈ నెల 6 తేదీ నుంచి సవరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువలను సవరించాల్సిందిగా.. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎల్లుండి నుంచి కొత్త మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్ విలువలకు అనుగుణంగా ఆ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి.