నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (NHRC) సభ్యుల ఆత్మీయసమ్మేళణం.!
విశాఖపట్నం ప్రతినిధి:
విశాఖపట్నం గాజువాక ఎస్.బీ.టి హోటల్ నందు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (NHRC) సమ్మేళన సభ నేషనల్ చైర్మన్ డా,,పి.సంపత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ అడిషనల్ జాతీయ అదనపు ముఖ్యకార్యదర్శిగా కందుల చందు నియమితులు కాగా నేషనల్ లీగల్ సెల్ కార్యదర్శి గా శనపల.గణపతి నియమితులయ్యారు, నూతన నాయకుల నియామకం జరిగింది పొట్టి,లింగరాజు, రాజారావు, శ్రీమతి నెట్టెం నీలిమ,జిల్లా నాయకులుగా నియమితులు అయ్యారు, రాష్ట్ర డివిషనల్ ఉపాధ్యక్షులుగా మోహన్ సాయి నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు, రాష్ట్ర వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్న సూరు శ్రీనివాస్ గారి సేవలను గుర్తించి జాతీయ సంయుక్త కన్వెనిర్ గా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఈ సందర్భంగా నూతన సబ్యులకు జాతీయ చైర్మన్ డా,,పి.సంపత్ కుమార్ అభినందనలు తెలియజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సభ్యుడు సమాజ శ్రేయస్సు కోసం సామాజిక భాద్యతలు విస్మరించరాదని ప్రతి సభ్యుడు న్యాయ పరిరక్షణలో ,రాజ్యాంగం అందించిన హక్కులను ప్రజలకు తెలియచేయటంలో తమవంతు కృషి చేయాలని సూచించారు, సంస్థలో ఎవరికి వారు గ్రూప్ పాలిటిక్స్ చేయవద్దని హితవుపలికారు. బాధితులు గోడు వినని వారు నాయకులు కాదని తేల్చిచెప్పారు, నాయకుడు పదిమంది ముందు నడిస్తే వెనుకతాను నడిచేవాడు కాదని ఒక్కడై తానే ముందుండి నడిపించే సామర్ధ్యం కావాలని కోరారు. ఒక భాదితునికి లేదా బాధితురాలికి న్యాయం అందించాలంటే మనవేణుక 10మంది అవసరం లేదని మీకు సంస్థ అందించిన గుర్తింపు కార్డు ఒక్కటి వెలమందితో సమానమని ధైర్యంగా ముందుకు వెళ్ళండి అంటూ సభ్యుల్లో ధైర్యాన్ని నింపారు. ఈ సమావేశంలో జిల్లా లీగల్ సెక్రటరీ నాగేశ్వర రావు , రాష్ట్ర వెల్ఫేర్ సెక్రటరీ బోరాడ భాస్కరరావు, జాతీయ కన్వెనిర్ బుగత లీలప్రసాద్, మీడియా సభ్యులు బుద్ధ మోహన్, జబెద్య, ఓంకార్, ధన లక్ష్మీ, ఆదిలక్ష్మి, విజయ, మరియు మహిళా జిల్లా అధ్యక్షురాలు పద్మావతి , రాష్ట్ర స్పోక్స్ మాన్ కుప్పిలి డాక్టర్ రావు శ్రీధర్, విజయనగరం జిల్లా అధ్యక్షులు అర్జున్ మరియు జిల్లాల నాయకులు పాల్గొన్నారు. నూతన సబ్యులకు అభినందనలు తెలిపారు.

