139 బీసీ కులాల అభివృద్ధికి కృషి చేస్తా: గోల్లంగి ఆనంద్ బాబు.

 139 బీసీ కులాల అభివృద్ధికి కృషి చేస్తా: గోల్లంగి ఆనంద్ బాబు.

విశాఖ లోకల్ న్యూస్  కొమ్మాది, 

తెలుగుదేశం పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు నియమితులైన గోల్లంగి ఆనందబాబు తెలిపారు.

సోమవారం నాడు ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బిసి కులాల స్థాపకుడు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మాట్లాడుతూ జ్యోతిరావు గోవిందరావు ఫులే (1827 ఏప్రిల్ 11 -  జన్మించారఅని  ఒక భారతీయ సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త, మహారాష్ట్రకు చెందిన రచయిత. అతను కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు ఫులే అని ఆయన   అడుగుజాడల్లో నడుస్తా అని ఆనంద్ బాబు తెలుపుతూ తాను1996 పోతిన  అప్పారావు ఆధ్వర్యం లో చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక  నుంచి టీడీపీకి విధేయుడిగా వున్నానని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి అహర్నిశలు పనిచేస్తానన్నారు. తనను 139 బిసి కులాలకు సంభందించిన టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు నియమించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు, జాతీయ కార్యదర్శి లోకేశ్ కు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు, కు, 'భీమిలి' ఇన్ చార్జి కోరాడ రాజబాబు, తదితరులకు కృతజ్ఞతలు.గోల్లంగి ఆనంద్ బాబు తెలిపారు.