తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో 'బాదుడే బాదుడు' J-Tax బాదుడే బదుడు

 తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో 'బాదుడే బాదుడు'  J-Tax బాదుడే బదుడు.

విశాఖపట్నం:
భీమిలి జీవీఎంసీ 6వ వార్డ్ లో మంగళవారం సాయంత్రం కొమ్మది రిక్షా కొలనిలో పెరుగుతున్న పెట్రోల్ , డీజిల్ ధరలు మీద అలాగే కరెంటు చార్జీలు మీద  కొవ్వొత్తులు,నిరసన తెలుపుతూ బాదుడే బాదుడు'  J-Tax బాదుడే బదుడు కార్యక్రమం ర్యాలీగా   తెదేపా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకత విధానాలను వివరించారు.
వార్డ్ అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు,రాష్ట్ర బిసి సెల్ల్ ఉపాధ్యక్షుడు ఆనంద్ బాబు గొల్లంగి తదితరులు  ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ముఖ్య మంత్రి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకత విధానాలను వివరించారు. ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచ కుండా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాటు పరిపాలన సాగించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోవార్డు బిసిసెల్ అధ్యక్షులు రెడ్డి సత్యనారాయణ యువత అధ్యక్షుడు నక్క రమణ ఆరోవార్డు కార్యదర్శి పోలిశెట్టి నాగేశ్వరావు ఆరో వార్డు మహిళా అధ్యక్షురాలు పెంటకోట బబ్బెలు గోలగాన సన్యాసిరావు రఘు బలరాం గిరి కె.వి.ఆర్ గురునాధ సుంకరి నూకరాజు అతి పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.