మరమ్మతులకు నోచుకోని రహదారులు.!
విశాఖ లోకల్ న్యూస్ :
విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం 88వ వార్డు జివిఎంసి గాజువాక పరిధి లో ఉన్న కోట నరవ ప్రధానమైన రహదారి గుంతలతో నిండి ఉండడం చాలా బాధాకరం. స్థానిక ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. దీనిపైన అనేక మార్లు సచివాలయ సిబ్బంది తో మాట్లాడితే సాంక్షన్ లో పెట్టాము దీనిపైన పూర్తి సమాచారం జివిఎంసిలో దొరుకుతుందని సచివాలయ సిబ్బంది తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ వార్డు సచివాలయం అలాగే జివిఎంసి అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యలను పరిష్కరిస్తారని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

