నగరాలు కార్పొరేషన్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షన్.!

 నగరాలు కార్పొరేషన్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షన్.!

విశాఖ లోకల్ న్యూస్ :

స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయం మేరకు రాష్ట్ర మంత్రివర్యులు, భీమిలి శాసనసభ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జీవీఎంసీ ఆరో వార్డు రేవల్ల పాలెంలో లో రాష్ట్ర నగరాలు లో కార్పొరేషన్ చైర్పర్సన్ పిళ్ళా సుజాత సత్యనారాయణ ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త విడిగా వేయటానికి డస్ట్ బిన్ ల పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో నగరాలు కార్పొరేషన్ డైరెక్టర్ వాండ్రాసి శ్యామల, వైఎస్ఆర్సీపి సీనియర్ నాయకులు పిళ్ళా సత్యనారాయణ విశాఖ నగర వైఎస్ఆర్సీపి సోషల్ మీడియా సభ్యులు పిళ్ళా సూరిబాబు, వాండ్రాసి సూరి అప్పారావు, డ్వాక్రా ఆర్ పి గౌతమి, కిల్లాన. భవాని గ్రామ పెద్దలు, 43వ సచివాలయం శానిటరీ సెక్రటరీ బి. రమణ , సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

.