గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందని ద్రాక్ష దేశ అభివృద్ధికి ఇది అడ్డుగోడ లాంటిది .
విశాఖ లోకల్ న్యూస్ :
అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా కార్మిక నాయకుడు ఆడారి ఆవేదన వ్యక్తం చేశారు .
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూ హెచ్ ఓ ఇతర సంబంధిత సంస్థల ప్రయోజకత్వంలో జరుపుకునే ప్రపంచ ఆరోగ్య అవగాహన దినం 1948లో
డబ్ల్యూ హెచ్ ఓ మొదటి ప్రపంచ ఆరోగ్య సభ నిర్వహించింది .
1950నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గా ఏప్రిల్ 7ను జరుపుకోవాలని అసెంబ్లీ నిర్ణయించింది .పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటలను కార్మిక నాయకుడు గుర్తు చేశారు .అలాంటి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందని ద్రాక్షగా మారిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇది దేశ అభివృద్ధికి అడ్డుగోడలా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ రాష్ట్రంలో) ఖమ్మం .భద్రాచలం .వరంగల్ .వంటి ఏజెన్సీ ప్రాంతాలలో (ఆంధ్రప్రదేశ్ లో ) విశాఖ. విజయనగరం. శ్రీకాకుళం. తూర్పుగోదావరి .అల్లూరి సీతారామరాజు జిల్లా వంటి ప్రాంతాలలో వైద్యం అందని ద్రాక్షగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు

