ప్రభుత్వ భూములు అమ్మొద్దంటే అరెస్టుల.సీపీఎం.

 ప్రభుత్వ భూములు అమ్మొద్దంటే అరెస్టుల.సీపీఎం.

విశాఖ లోకల్ న్యూస్:

ప్రభుత్వ భూములను ఇష్టా ను సారం వ్యాపారం చేసుకోవడానికా ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించినది అని సీపీఎం మధురవాడ జోన్ కమిటీ ప్రశ్నిచింది.మధురవాడ ఐ టీ సెజ్ హిల్ 3 లో జరిగిన భూముల అమ్మకాల ను వ్యతిరేకిస్తూ సీపీఎం నగర నాయకులు బుధవారం ఉదయం పరియటన కు రానుండగా పోలీసులతో వై యస్ ఆర్ సి పి ప్రభుత్వం మధురవాడ జోన్ నాయకులను తెల్లవారేసరికి అరెస్టులు చేసి నిర్బంధించారు.మధ్యాహ్నం 12 గంటలకు నోటీసులు తీసుకొని విడుదల చేశారు.ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పాత్రికేయులతో మాట్లాడుతూ వై యస్ ఆర్ సి పి వాళ్ళు అమ్మారని టీడీపీ వాళ్లు,టీడీపీ వాళ్లు 2005 ఎన్ సీ సీ అనే సంస్థకు అమ్మారాని వై సీ పీ వాళ్ళు విమర్శలు చేసుకుంటున్నారని అన్నారు.ఏది ఏమైనా ఏ ప్రభుత్వమైనా ప్రజల సంపద అయిన భూములను తమ అనుయాయుల వ్యపారాలకోసం అమ్మడానికి విరేవరని ప్రశ్నించారు.ప్రజల సమస్యలపై పోరాడే వాళ్ళు కాకుండా వ్యాపారాలు చేసుకుంటూ ప్రజల సంపద కొల్లగొట్టే వాళ్ళు చట్ట సభలకు ప్రాతినిధ్యం వహిస్తుండటం వలన ఇటు వంటి దోపిడీకి పాల్పడు తున్నారునీ అన్నారు.
పేద ప్రజలకు ఇవ్వడానికి భూములు వెతుకుతున్న ప్రభుత్వానికి ఈ భూములు కనిపించడం లేదా అని అన్నారు. కేబినేట్ వేసి ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం కోసం చర్చించిన మంత్రులు పేదల కోసం ఎందుకు చర్చించ లేదని విమర్శించారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం మాని ప్రజలకోసం ప్రభుత్వం పని చేయాలని డిమాండ్ చేశారు.నిర్భందం తో అనిచి వేసి తప్పుడు దారు ల్లో వెళితే ప్రజలు తగిన గున పాఠం చెప్పటం కాయమని అన్నారు.అరెస్టు అయిన వారి లో సీపీఎం జోన్ కార్యదర్శి డీ అప్పలరాజు,పి రాజు కుమార్, బీ భారతి,ఎస్ పైడితల్లి,కే సుజాత