టీడీపీ విశాఖ ఉత్తర శాసనసభ్యులు గంటా ఆధ్వర్యంలో వైస్సార్సీపీ నుండి భారీ చేరికలు.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం
మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆశీస్సులతో ఆయన సమక్షంలో, విశాఖ పార్లమెంటరీ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం 14వ వార్డు కు చెందిన గొంప ధర్మ మరియు 42 వ వార్డు కు చెందిన గోపాల్ రెడ్డి లు తమ అనుచరులు సుమారు 100 మందితో తెలుగు దేశం పార్టీలో చేరారు. మొదటి గా శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు డా అంబేడ్కర్ 131వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి అనేక నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులుకు అండగా నిలిచిన పార్టీయని, మహిళలకు, అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇచ్చే పార్టీ, త్వరలో పెద్ద పెద్ద నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ లో చేరికలు ఉంటాయని గురువారం అందుకు నాంది పలికినట్లు అని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత జిల్లా పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత, ఎస్సీ సెల్ పుచ్చా విజయ్ కుమార్, విశాఖ పార్లమెంటరీ పార్టీ తెలుగు మహిళా ప్రెసిడెంట్ అనంత లక్ష్మి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పైలా ముత్యాల నాయుడు, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కిరెడ్డి జగదీష్, మాజీ కార్పొరేటర్ గోగినేని సాంబశివరావు 42వ వార్డు ప్రెసిడెంట్ కన్నం వెంకటరమణారావు సెక్రటరీ ముక్కి రామకృష్ణ దువ్వి ఖాళీ ప్రసాద్, నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ శ్రీదేవి, ఎమ్ ఎల్ ఎన్ రావు, 14వ వార్డు వసంతరావు, జిల్లా పార్టీ కార్యదర్శి జాన్,45వ వార్డు ప్రెసిడెంట్ భరణకాన రాజు సెక్రటరీ నరేంద్ర కుమార్, ఐటిడిపి నరేష్ వాసుపల్లి రాజు శెట్టి మోహన్ దాస్, బర్ల బాలకృష్ణ బొడ్డేటి మోహన్, 46వ వార్డు ప్రెసిడెంట్ పుక్కళ్ళ పైడికొండ, 25వ వార్డు ప్రెసిడెంట్ నమ్మి రవి కుమార్, ఇస్సారపు వెంకట లక్ష్మీ ఇస్సారపు వాసు, కోనేటి సురేష్, ముక్కా శివ, 47వ వార్డు ప్రెసిడెంట్ రాజారావు, యాగాటి ఆదిలక్ష్మి, చెంగల శ్రీను నూకరాజు, 48వ వార్డు ప్రెసిడెంట్ గొర్లె అప్పారావు, 49వ వార్డు ప్రెసిడెంట్ పి మురళీ శేఖర్, 54వ వార్డు ప్రెసిడెంట్ కుట్టా కార్తీక్ 55వ వార్డు ప్రెసిడెంట్ గంట్యాడ వీరుబాబ, మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

