కోరాడ రాజబాబు పై తప్పుడు విమర్శలు తగవు : ఆనంద్ బాబు గొల్లంగి

 కోరాడ రాజబాబు పై తప్పుడు విమర్శలు తగవు : ఆనంద్ బాబు గొల్లంగి.


విశాఖ లోకల్ న్యూస్: 
భీమిలి నియోజకవర్గంలో పలువురు సీనియర్ నాయకులు కార్పొరేటర్స్ కొన్ని రోజులుగా పార్టీ పెద్దలను కలసి భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ కోరాడ రాజబాబు పై చేస్తున్న తప్పుడు విమర్శలు సరికాదని గొల్లంగి ఆనంద్ బాబు అన్నారు. సబ్బం హరి భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండేవారు సబ్బం హరి హఠాన్ మరణం తర్వాత భీమిలి నియోజకవర్గంలో నడిపించే నాయకుడు లేక పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితిలో అధిష్టానం సమర్ధుడు అని నమ్మి స్థానిక నాయకుడైన కోరాడ రాజబాబు కి భీమిలి నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించడం జరిగింది. కోరాడ రాజబాబు సమన్వయకర్తగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నుండి ఇప్పటివరకు రాత్రయినా పగలైనా తేడాలేకుండా పార్టీ కోసమే పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్నారని అనంద్ బాబు తెలిపారు. అలాంటి రాజబాబు పై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని నాయకుల్లో మనస్పర్ధలు ఉంటే అది స్థానం తెలియజేసి మాట్లాడుకుంటే సరిపోతుందని అలాకాకుండా దుష్ప్రచారం చేయడం వల్ల పార్టీకి చెడ్డ పేరు తేస్తున్నారని ఆనంద్ బాబు ఆవేదన చెందారు. కోరాడ రాజబాబు అధిష్టానం ఆదేశాల మేరకే కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన వ్యక్తిగత కార్యక్రమాలు ఏమీ చేయడం లేదని పార్టీ అంటే డబ్బులు ఖర్చు పెట్టి , ఫ్లెక్సీలో ఫొటోలు వేసుకోవడం కాదని ప్రజల్లో ఒక నాయకుడిగా ఉండి ప్రజలను ముందుకు తీసుకెళ్లే వాడే ఉండాలని అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని అలాంటి వాడే రాజబాబు అని ఆనంద్ బాబు తెలిపారు.