ఆర్టీసీ చార్జీలు పెంచడం దారుణం - తుపాకుల సంతోష్ రాజా.
(మధురవాడ: విశాఖ లోకల్ న్యూస్ ప్రతినిధి:)
ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని శాసనసభ సాక్షిగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ధరలు తగ్గించేసి ప్రజలపై మోపిన అదనపు భారం లేకుండా చేశ్తామని ప్రకటించి ,తీరా అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలతో పాటుగా పెట్రోల్,డీజిల్ చివరికి వంటనూనెల ధరలు కూడా పెంచడం దారుణం అని భీమునిపట్నం నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు తుపాకుల సంతోష్ రాజా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అంతే కాకుండా డీజిల్ ధరలు పెరగడం తోనే గత్యంతరం లేక ఆర్టీసి ఛార్జీల పెంపు అనివార్యమయిందని రవాణా శాఖా మంత్రి సామాన్య ప్రజలకు తెలపడంపై తీవ్రంగా ఖండించారు.

