ఓ గొప్ప వ్యక్తి జయంతిని జరుపుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుంది : ఆనంద్ బాబు గొల్లంగి.

 ఓ గొప్ప వ్యక్తి జయంతిని జరుపుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుంది : ఆనంద్ బాబు గొల్లంగి.

విశాఖపట్నం:
విశాఖ లోకల్ న్యూస్ :
భీమిలి జీవీఎంసీ జోన్ టు 6వార్డ్ ప్రెసిడెంట్ దాసరి శ్రీనివాస్ మరియు  రాష్ట్ర టీడీపీ BC సెల్ వైస్ ప్రెసిడెంట్ ఆనందబాబు గొల్లంగి ఆధ్వర్యంలో పోతినమలయ్యపాలెం ఎస్ సి  కోలాని లో వున్న అంబేద్కర్  విగ్రహానికి పులామాల వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 

ఈసందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ
Dr. బి ఆర్.  అంబేద్కర్ జయంతి  ఓ గొప్ప వ్యక్తి జయంతిని జరుపుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుంది. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతిని పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి.. ఆయనపై ఉన్న భక్తిని చాటుకుంటారు ప్రజలు అని ఆనంద్ బాబు తెలిపారు.   జనరల్‌గా భారతదేశంలో పుట్టడం మన అదృష్టం అని అనుకుంటాం కదా  డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ భారత గడ్డపై పుట్టడం భారతదేశ అదృష్టంగా భావించవచ్చు. 

ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు మహోన్నత భావాల శక్తి. ఆయన జీవితం కన్నీటి సంద్రం. ప్రతి రోజూ పోరాటాల మయం. చుట్టూ అవమానాలు, హేళనలు చేసే సమాజం. అంటరానివాడిగా ముద్ర. ఏం చేద్దామన్నా సమస్యే. ఒక్క అడుగు ముందుకు వేసేలోపు.. వెనక్కి లాగేసేలా వంద అడుగుల కుటిల యత్నాలు. అలాంటి చోట... అన్నింటినీ మౌనంగా భరిస్తూ, పర్వతమంత సహనంతో మెలగుతూ... ఉలి చెక్కిన శిల్పంలా తనను తాను మలచుకుంటూ... రాజ్యాంగ నిర్మాతగా మారి.. ఈ దేశానికి సరైన దిశా నిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ భీమ్‌రావ్ రాంజీ అంబేద్కర్. తమ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఆ మహనీయుడికి ఏం చేసినా తక్కువే అని భారతీయులు శాశ్వతంగా కీర్తించే అంబేద్కర్... బడుగు బలహీనుల అభ్యున్నతి కోసం అహరహం కృషి చేశారు. సాధారణ నేతలైతే పేదలకు మాటలతో హామీలు ఇచ్చి... చేతల్లో చేయకపోవచ్చు అని భావించిన ఆయన.. రాజ్యాంగ నిర్మాణంలోనే పేదలకు కచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించారు. అందుకే ఆయన్ని వాడవాడలా గుండెల్లో పెట్టేసుకుంటారు ప్రజలు. ఆయన జయంతిని తమ పుట్టిన రోజులా జరుపుకుంటారు. ఏప్రిల్ 

14, 1891లో పుట్టిన డాక్టర్ అంబేద్కర్... దేశ మొదటి ప్రధాని నెహ్రూ కేబినెట్‌లో న్యాయ శాఖ మంత్రిగా చేశారు. ఆర్థిక వేత్తగా, ప్రొఫెసర్‌గా, లాయర్‌గా, రాజ్యాంగ నిర్మాతగా ఇలా ఎన్నో సేవలు అందించారు. స్వాతంత్ర్య పోరాటంలో అపర మేధావిగా తనదైన మార్క్ చూపించారు. దీన జనులు, దళితుల హక్కుల కోసం పోరాడారు. ఇలా ఎన్నో చేశారు.స్వాతంత్రం వచ్చిన ప్రధమ రోజుల్లో మేధావులతో కలసి, భారత దేశా రాజ్యంగాన్ని చేతి రాతతో రచింపజేసిన అద్భుత వ్యక్తిత్వం కలిగిన, వీరి కి పులా మాల వేయడం,నా అదృష్టం అని ఆనంద్ బాబు గొల్లంగి తెలిపారు.
ఈ కార్యక్రమంలో KVR గురునాధ రావు,వార్డ్ BC సెల్ ప్రెసిడెంట్  రెడ్డి సత్యనారాయణ, రాజు  ,గిరి,బలరాం,రామకృష్ణ,వర్మ లు తదితరులు పాల్గొన్నారు.