మహిళ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన నగర మేయర్ .

 మహిళ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన నగర మేయర్.

విశాఖ లోకల్ న్యూస్:

ఆరిలోవ లో  మహిళ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి. మంగళవారం ఆమె ఆరిలోవ దుర్గా బజార్  నాయుడు పోలి క్లినిక్ నందు క్రీస్తు శేషులు రాపర్తి సన్యాసి నాయుడు జ్ఞాపకార్థం వారి కుమారులు డాక్టర్ ఆర్.ఎస్ నాయుడు ఆధ్వర్యంలో మహిళల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నేడు మహిళలకు సంబంధించి అనేక గైనిక్ సమస్యలు అధికంగా ఉన్నాయని, ముఖ్యంగా పేదవారు వారికున్న సమస్యలు ఆర్థిక ఇబ్బందుల వలన నిర్లక్ష్యం వహించి అగ్నికి సంబంధించిన సమస్యలను అధికం చేసుకుంటున్నారని, వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఉచిత వైద్య శిబిరానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. స్త్రీల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నాయుడు ను అభినందించారు.