వైస్సార్ బీమా పంపిణీ.
విశాఖ లోకల్ న్యూస్
స్థానిక 22వ వార్డు రాజీవ్ నగర్ లో గుండె పోటుతో మృతి చెందిన వ్యక్తి కుటుంభానికి తక్షణ సహాయం కింద మంగళవారం కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వైస్సార్ బీమా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ నగర్ లో కంచుబోయిన రామకృష్ణ గుండెపోటుతో మరణించారని చెప్పారు. ఆయన భార్య సృజన కి తక్షణ సహాయం కింద వైస్సార్ బీమా నుంచి రూ.10 వేలు నగదు అందించమన్నారు. సామియాన వ్యాపారం చేస్తున్న రామకృష్ణ 36 సంవత్సరాల చిన్న వయస్సులో ఈ లోకాన్ని వీడి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ కార్యదర్శి K.రాము, వెలెఫేర్ కార్యదర్శి పి.సత్య, స్థానిక నేతలు పీతల మధుసూదనరావు, డేవిడ్, రవి, ఒమ్మి పొలరాజు పాల్గొన్నారు.