ములగాడ లో బాబూ జగ్జీవన్ రామ్ గారి 115 వ జయంతి వేడుకలు.
విశాఖ లోకల్ న్యూస్:
భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 115 వ జయంతి కార్యక్రమం 58 వ వార్డ్ , ములగాడ, ఎస్ సి ఏరియా లో జరిగింది. ముఖ్య అతిథులుగా వార్డ్ కార్పొరేటర్ గులిగిందల లావణ్య బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అలాగే వైస్సార్సీపీ వార్ద్ అద్యక్షులు గులిగిందల కృష్ణ , పెద్దాడ వెంకట రమణ, ఎదురు అప్పల స్వామి,వై. నిర్మల, పి.రాజు ,కాకి కృష్ణ, అలానే జాషువా సంఘం నాయకులు,మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వార్డ్ కార్పొరేటర్ గులిగిందల లావణ్య మాట్లాడుతూ , బాబూ జగ్జీవన్ రామ్ గొప్ప రాజకీయ నాయకులు అని, సుదీర కాలం కేంద్రమంత్రి గా భారత దేశం ప్రజలకు సేవ చేశారని , కొనియాడారు. స్వాతంత్ర సంగ్రామం లో జైలు జీవితం అనుభవించారు,అలాగే ముఖ్యంగా పేద ప్రజలు, ఎస్ సి,ఎస్ టి మరియు బి సి లకు సామాజిక న్యాయం కోసం ఎంతో కృషచేశారు. అని తెలియ చేశారు.