సభ్యుల ఐక్యమత్యమే అసోసియేషన్ అభివృద్ధికి కారణం

  సభ్యుల ఐక్యమత్యమే అసోసియేషన్ అభివృద్ధికి కారణం.

*విలేకర్ల సంక్షేమానికి ఎస్సిఆర్డబ్ల్యూఏ ఎనలేని కృషి* 

*మధురవాడ యూనిట్ సభ్యులకు నిత్యావసర సరుకులు, స్వీట్లు పంపిణీ* 

సమాజంలో పాత్రికేయ వృత్తి ఎంతో గౌరవప్రదమైంది ... *జోన్ 2 కమీషనర్ బొడ్డేపల్లి రాము* 

పి.ఎమ్.పాలెం సి.ఐ అడబాల రవికుమార్* 

 
విశాఖ లోకల్ :మధురవాడ ప్రతినిధి 

 స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉగాది సంబరాలు - 2022 లో భాగంగా శుక్రవారం కొమ్మాది జంక్షన్ త్రిశక్తి దేవాలయం ఫంక్షన్ హాల్లో మధురవాడ యూనిట్ సభ్యులకు నిత్యావసర సరుకులు, మిఠాయిల పంపిణి చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జీవీఎంసీ జోన్ 2 కమీషనర్ బొడ్డేపల్లి రాము, పి.ఎమ్.పాలెం సి.ఐ. అడబాల రవికుమార్ ముఖ్య పాల్గొన్నారు. ఈ మేరకు అతిథులకు ఎస్.సి.ఆర్.డబ్ల్యూ. ఏ. కార్యదర్శి సూర్య ప్రకాష్,కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్లాజీ  
పుష్పగుచ్ఛాలు అందచేసి మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా జోనల్ కమీషనర్ బొడ్డేపల్లి రాము మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయ వృత్తి ఎంతో గౌరవప్రదమైందని అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను కథనాల రూపంలో ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను త్వరగా పరిష్కారం చేయడంలో మీడియా పాత్ర అద్వితీయమని అన్నారు..అటువంటి మీడియా వృత్తిలో ఉన్న జర్నలిస్టులకు అండగా నిలుస్తున్న స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు ప్రశంసనీయం అని కొనియాడారు.. అనంతరం పి.ఎమ్.పాలెం సి.ఐ.రవికుమార్ మాట్లాడుతూ
నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియచేయడం పాత్రికేయ వృత్తికే చెల్లిందని ఆయన అన్నారు.గ్రేటర్ విశాఖ పరిధిలో నలుమూలలా ఉన్న జర్నలిస్టులకు వెల్ఫేర్ అందిస్తున్న అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ ను అభినందించారు. కొన్నేళ్ల క్రితం 25 మందితో ఏర్పాటైన అసోసియేషన్ నేటికి 250 మంది పాత్రికేయులతో బలపడిన విధానం చూస్తుంటే అసోసియేషన్ పట్ల సభ్యులకున్న నమ్మకం, ఐక్యమత్యం స్పష్టం అవుతుందని అన్నారు..సీనియర్ పాత్రికేయులు కృష్ణారావు,త్రిమూర్తి లు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జర్నలిస్టుల సంక్షేమం పై చూపిస్తున్న కృషి అభినందినీయమని అన్నారు..
  అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ గత ఆరేళ్లుగా జర్నలిస్టుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. అసోసియేషన్ సంక్షేమ ఫలాలు ఎక్కువ మంది జర్నలిస్టులకు అందివ్వాలనే లక్ష్యంతో అసోసియేషన్ సేవలను గ్రేటర్ విశాఖ మొత్తం అందిస్తున్నామని అన్నారు. వార్తలు వ్రాసే నైపుణ్యత ప్రతి జర్నలిస్టుకు అలవడే విధంగా శిక్షణ తరగతులను త్వరలో అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నామని సభనలకరించిన అతిథులకు దృష్టికి తెలియచేశారు. అదే విధంగా త్వరలో పద్మనాభం మండలం ఇతివృత్తం ఏమిటి అనే దానిపై అవగాహన కల్పించి, అక్కడి చారిత్రక విషయాలను ప్రజలకు తెలియచేసే సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. అసోసియేషన్ తరపున అందించే ప్రతి సేవా కార్యక్రమంలో ఎందరో అందిస్తున్న సహాయ సహకారాలు ఉన్నాయన్నారు. అత్యధిక సంఖ్యలో జర్నలిస్టులకు సహాయపడడంలో దొరికే ఆనందం మాటలతో చెప్పలేనిది అన్నారు. తమ ఈ లక్ష్యానికి చేదోడుగా నిలుస్తున్న దాతలు, సామాజిక సంఘ సేవ ఆసక్తి పరులు, ఇతరులు అందరికీ అసోసియేషన్ కృతజ్ఞతగా ఉంటుందన్నారు. నిబద్ధత, క్రమశిక్షణలతో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. భవిష్యత్ లో జర్నలిస్టులకు ఎటువంటి సమస్యలు ఉన్నా అసోసియేషన్ పరమైన సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. అనంతరం 
సీనియర్ జర్నలిస్టులు బొల్లు కృష్ణారావు,బొక్కా త్రిమూర్తి లను అతిధుల చేతుల మీదుగా సత్కరించారు..
ఈ కార్యక్రమంలో ఎస్. సి.ఆర్.డబ్ల్యూ.ఏ ముఖ్య సలహాదారులు కర్రి సత్యనారాయణ,
జాయింట్ సెక్రటరీలు అబ్బిరెడ్డి చంద్రశేఖర్, బాలు పాత్రో, సభ్యులు పాల్గొన్నారు.