స్పందించిన 5వ వార్డ్ కార్పోరేటర్.!
75వ సచివాలయంలో చోరుల హస్తలాఘవంతో కంప్యూటర్లు, ప్రింటర్లు మాయం.
విషయం తెలుసుకుని 75వ సచివాలయానికి ప్రింటర్ ను అందించిన కార్పొరేటర్ మొల్లి హేమలత.
మధురవాడ: జీవీఎంసీ జోన్-2 పరిధి మారికవలస కాలనీ లో గల 75వ సచివాలయంలో గతంలో కంప్యూటర్లు చోరీ జరిగాయి. సచివాలయ సిబ్బంది మాత్రం పౌర విధులకు ఆటంకం కలుగకుండా తమకు దగ్గర్లో ఉన్న సచివాలయానికి వెళ్లి ప్రజా సంబంధమైన పనులను చేస్తున్నారు.మారికవలస కాలనీలో పర్యటనలో భాగంగా సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను పరిశీలించిన 5వ వార్డు కార్పొరేటర్ మొల్లిహేమలత సచివాలయంలో తస్కరణకు గురైన కంప్యూటర్స్ ఇతరత్రా సామాగ్రి విషయాన్ని తెలుసుకున్నారు.వెంటనే స్పందించిన కార్పొరేటర్ మొల్లి హేమలత ప్రజలపనులకు ఆటంకం వాటిల్లకుండా సచివాలయం సిబ్బంది విధులు నిర్వహించాలని ఆశిస్తూ... ప్రింటర్ ను 75వ సచివాలయం సిబ్బందికి జోన్-2 కమీషనర్ బొడ్డేపల్లి రాము, పి.ఎమ్.పాలెం సి.ఐ ఎ.రవికుమార్ సమక్షంలో అందించారు.ఈ సందర్భంగా సచివాలయం సిబ్బంది కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో మొల్లిలక్ష్మణరావు,స్థానిక వైయస్సార్ సిపి నాయకుడు జె.ఎస్.రెడ్డి సచివాలయ అడ్మిన్ ఎస్ ఝాన్సీ,మహిళాపోలీస్ ఎం.ప్రసన్నకుమారీ, సచివాలయం సెక్రటరీ జి.పూర్ణసాయి,ఎ.దుర్గాప్రసాద్. వి.కామేశ్వరరావు పాల్గొన్నారు.