మధురవాడ లో బైక్ ప్లస్.
ఎస్.టి.బి.ఎల్ వద్ద 22వ బ్రాంచి ప్రారంభోత్సవం.
మధురవాడ:
ద్విచక్ర వాహనాల మీద ప్రయాణం కొనసాగిస్తుండగా మార్గ మధ్యంలో తాము ప్రయాణిస్తున్న ద్విచక్ర ఆగిపోతే కలిగే అవస్థ వర్ణనాతీతం. వీటికి స్వస్తి చెపుతూ... ఇలాంటి సందర్భాల్లో ఉత్తమసేవలు అందించేందుకు బైక్ ప్లస్ ఏర్పాటుచేశామని బైక్ ప్లస్ వ్యవస్థాపకులు శిరీష్,శరత్ లు అన్నారు. కొమ్మాది జంక్షన్ ఎస్.టి.బి.ఎల్ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన బైక్ ప్లస్ ను జి.కె ఎలక్ట్రికల్ ప్రొపరేటర్ ఎమ్. నాగేంద్ర రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.బయట బైక్ మెకానిక్లు తీసుకునే ధరల కన్నా రూ.699స్వల్ప ధర తోనే తమ వద్ద బైక్ సర్వీసింగ్ చేయడం జరుగుతుందని అన్నారు.బైక్ ప్లస్ ప్రాంచైజి ఓనర్ హరికృష్ణ మాట్లాడుతూ తమ ఎలక్ట్రికల్ వాహనాల అమ్మకం కూడా కలదని తెలిపారు.కస్టమర్ల ఆశీస్సులతో కొమ్మాది జంక్షన్ ఎస్.టి.బి.ఎల్ వద్ద 22వ బైక్ ప్లస్ బ్రాంచిని ప్రారంభించామని ఆయన తెలిపారు.త్వరలోనే విజయనగరంలో కూడా ఇంకో బ్రాంచ్ ప్రారంభం చేయనున్నామని అన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేసే వారిలో 25 మందికి లక్కీ డ్రా తీయడం జరుగుతుందని వారిలో మొదటి విజేతకు రూ.25 వేల ఆఫర్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ద్విచక్ర వాహన కస్టమర్లకు సౌలభ్యకరంగా బైక్ ప్లస్ లో సేవలు అందజేస్తామని పేర్కొన్నారు.



