బాల్ బ్యాట్మెంటన్ పోటీలను ప్రారంభించిన నార్త్ ఏసీపీ చుక్క శ్రీనివాసరావు.
విశాఖ లోకల్ న్యూస్:మధురవాడ ప్రతినిధి,
మహా విశాఖ ఆరో వార్డు పరిధిలోని పోతినమల్లయ్య పాలెం చివర బస్టాప్ వద్ద నిర్వహిస్తున్న బాల్బ్యాడ్మింటన్ పోటీలను నగర పోలీస్ సబ్ డివిజన్ ఏసిపి శ్రీనివాస రావు శనివారం ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని ఆయన మాట్లాడుతూ క్రీడల పట్ల యువత ఆకర్షణ అవుతున్నారని, క్రీడల వల్ల మానసిక శారీరక దారుఢ్యం తో పాటు తమ బంగారు భవిష్యత్తును రూపుదిద్దుకోవచ్చని అన్నారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తిని చూపే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు. విశాఖపట్నం విశాఖ రూరల్ చినగదిలి బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రెండురోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ పోటీల నిర్వాహకులు మాట్లాడుతూ ఈ పోటీలకు రాష్ట్రంలో పలుప్రాంతాలకు చెందిన 12 జట్లను ఆహ్వానించడమైనదన్నారు. ఈ పోటీలలో విజేతలకు ప్రథమ బహుమతి రూ .12,000 / - మరియు ( ట్రోఫి ) రెండవ బహుమతి రూ .10,000 / - మరియు ( ట్రోఫి ) రూ .8,000 / - మరియు ( ట్రోఫి ) మూడవ బహుమతి నాల్గవ బహుమతి రూ .6,000 / - మరియు ( ట్రోఫి ) ఐదవ బహుమతి రూ .4,000 / ఆరవ బహుమతి రూ .2,000 / అందించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు ఉచిత భోజన , వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయబడును . మరియు విజేతలకు బహుమతులను అసోసియేషన్ వారు మరియు క్రీడాభిమానుల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేయడమైనదాని అన్నారు . ఈ పోటీల విజేతలకు తేది . 3-4-2022న గౌరవ మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదగా బహుమతులు ఇవ్వబడునున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డి కె వి ఆర్ మోహన్ రావు, కార్యదర్శి ఎంవి రత్నం, ఎం భాస్కర్ రావు, రామ్ కుమార్, ఎల్ శ్రీనివాసరావు, రమణ రావు, కే సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.