సి పి ఐ ఆద్వర్యంలో బుధవారం ఇంటింటికి ప్రచారాందోళన.
విశాఖపట్నం :మధురవాడ
బుదవారం గ్రామ వార్డు సచివాలయాల వద్ద ధర్నాలు జయప్రదం చేయండి.
మధురవాడ మంగళవారం కళా నగర్ ఏరియాలో సి పి ఐ నగర సమితి సభ్యులు వాండ్రాసి సత్యనారాయణ మాట్లాడుతూ పెంచిన విద్యుత్ చార్జీలు, ఆస్తి, నీటి, చెత్త పన్నులను రద్దు చేయాలని, పెట్రోల్ ,డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని వాటిని జి ఎస్ టి పరిధిలోకి తేవాలని 13 గ్రామ వార్డు సచివాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తామన్ని సి పి ఐ ఇంటింట ప్రచార కార్యక్రమం చేసారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు పై విద్యుత్ చార్జీలు 1400 కోట్లు, ట్రూ అప్ చార్జీలు పేరు తో మరో 2900 కోట్లు విద్యుత్ చార్జీలు పెంచారన్ని పెంచిన విద్యుత్ చార్జీలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం హద్దు అదుపు లేకుండా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతున్నాది అన్నారు. వాటిని జి ఎస్ టి పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు 99 శాతం ఉన్న ప్రజలు పై భారాలు వేస్తూ ఒక శాతం ఉన్న అదాని లాంటి ప్రవేటు పారిశ్రామిక వేత్తలు కు 12 , 777కోట్లు రుణాన్ని రద్దు చేశారన్న ప్రజలు పై వేసిన భారన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలు అందరు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సి పి ఐ నగర కార్యవర్గ సభ్యురాలు ఎమ్ ఎ బెగమ్, మధురవాడ నాయకులు ఎమ్ సన్నిపాత్రడు, టి చిరంజీవి, వీర బాబు, సురేష్, సంతోష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

