భీమిలి నియోజవర్గ ఇంచార్జ్ ను తక్షణమే మార్చాలని వినతి : కోరాడ నాగభూషన్.
విశాఖపట్నం :
విశాఖ జిల్లా ఎన్టీఆర్ భవన్ టీడీపీ పార్టీ కార్యాలయం లో విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ లను కలసి పార్టీ సీనియర్ నాయకులు కోరాడ నాగభూషన్ కు ఇచ్చిన షోకాజ్ నోటీస్ పై వివరణ ఇచ్చామని తెలిపారు.
ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయకుండా పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడ్డారని, ఈ మధ్య జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పోరాడిన నాగభూషన్ కు భీమిలి నియోజవర్గ ఇన్చార్జి కోరాడ రాజబాబు కనీసం పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా దూరం పెట్టి కేంద్ర కమిటీతో షోకాజ్ నోటీస్ ఇవ్వడం అన్యాయమని,నాగభూషన్ అన్నారు.
సీనియర్ నాయకులను కలుపుకోకుండా, అతను చేస్తున్న కార్యక్రమాలకు మాజీ శాసనసభ్యులు, మాజీ మార్కెట్ చైర్మన్ లను, కార్పొరేటర్ ను, మాజీ జెడ్పిటిసి ను పిలవడం లేదని చెప్పారు.తక్షణమే పార్టీ దృష్టి పెట్టి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి సమన్వయము చేయాల్సిందిగా కోరారు.ఒంటెద్దు పోకడలకు పోతున్న భీమిలి నియోజవర్గ ఇంచార్జ్ ను తక్షణమే మార్చవలసినదిగా కోరడమైనది.
భీమిలి నియోజకవర్గం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు కర్రి సీతారాం, మాజీ ఏఎంసీ చైర్మన్ కోరాడ నాగభూషణ్, రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గాదు అప్పలనాయుడు, 6 వ వార్డు అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి బొమ్మిడి ఉమా, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎర్ర రాము, గంభీరం సర్పంచ్ వానపల్లి ముత్యాలరావు, సీనియర్ నాయకులు బొమ్మిడి సూర్యనారాయణ, గంభీరం ఉపసర్పంచ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

