బుధవారం 90వార్డ్ నందుతాత్కాలిక ఆధార్ పౌర సేవా కేంద్రం ప్రారంభోత్సవం

 బుధవారం 90వార్డ్ నందుతాత్కాలిక ఆధార్ పౌర సేవా కేంద్రం ప్రారంభోత్సవం.

విశాఖపట్నం :

90వార్డ్ లోని కాకాని నగర్ నందు కాకాని నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు 90వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ వారి సంయుక్త ఆధ్వర్యంలో కాకాని నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద తాత్కాలిక ఆధార్ పౌర సేవా కేంద్రం ప్రారంభించిన 90వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ. ఈ ఒక్క తాత్కాలిక ఆధార్ పౌర సేవా కేంద్రం శుక్రవారం వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి కాకాని నగర్, విమాన్ నగర్ ప్రాంత ప్రజలే కాకుండా 90వార్డ్ యావన్మంది ప్రజలు ఈ సదవకాసాన్ని వినియోగించుకోవాలని బొమ్మిడి రమణ కోరారు.
ఈ కార్యక్రమంలో కాకాని నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ మోహన్, కార్యదర్శి సిద్ద రాజా భాస్కర్, ఎస్ . రమణ, బి మురళి, తదితరులు పాల్గొన్నారు.