రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131 వ జయంతి పురస్కరించుకొని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు.

 రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131 వ జయంతి పురస్కరించుకొని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు.

విశాఖపట్నం :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131 వ జయంతి పురస్కరించుకొని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పి . సంపత్ కుమార్ ఆదేశాల మేరకు జాతీయ కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  నేషనల్ లీగల్ సెక్రటరీ లీలా హరి ప్రసాద్ నేషనల్ కన్వీనర్ బి. లీలా ప్రసాద్ పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి, బలహీన వర్గాలకు అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ రాష్ట్ర స్పోకేస్ మెన్ కుప్పిలి డాక్టర్ రావు, రాష్ట్ర సభ్యులు మురళీమోహన్, ఓంకార్, చంద్రమౌళి, శ్రీను (నేవీ), సంతోష్,  చంద్రశేఖర్, విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు పద్మావతి, అనుపమ యాదవ్, ఆదిలక్ష్మి ,గాయత్రి, సారా జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.