60మంది పదవ తరగతి విద్యార్థులకు కంపాస్ బాక్స్ లు పంపిణీ.

 60మంది పదవ తరగతి విద్యార్థులకు కంపాస్ బాక్స్ లు పంపిణీ.

విశాఖపట్నం:
గొట్టిపల్లి ఉన్నత పాఠశాలలో 60మంది పదవ తరగతి విద్యార్థులకు కంపాస్ బాక్స్ లు మరియు ఎగ్జామ్ పేడ్స్ కోరాడ నాగభూషణ రావు కుమారుడు వేములవలస ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొట్టిపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.సన్యాసిరావు,స్థానిక తెదేపా నాయకుడు కోరాడ నాయుడుబాబు, గొట్టిపల్లి సత్యసాయి భజనమండలి కన్వీనర్ కోరాడ తమ్మునాయుడు,బాలవికాస్ మరియు ఆధ్యాత్మిక కన్వీనర్ డబ్బీరు వెంకట సంతోష్ కిరణ్,ఉపాధాయులు తదితరులు పాల్గొన్నారు.