5వ వార్డు అభివృద్ధికి సహకరించండి.
జి.వి.ఎమ్.సి కమీషనర్ లక్ష్మీషాని విజ్ఞప్తి చేసిన కార్పొరేటర్ మొల్లిహేమలత.
.వి.ఎమ్.సి కమీషనర్ లక్ష్మీషాని విజ్ఞప్తి చేసిన కార్పొరేటర్ మొల్లిహేమలత
5వ వార్డు అభివృద్ధికి సహకరించండి.
రానున్న వేసవి కాలం దృష్ట్యా వార్డ్ లో త్రాగు నీరు సమస్య లేకుండా చేయాలని వినతి
శాశ్వత శానిటేషన్ ఇన్స్పెక్టర్ నియమించాలి.
మధురవాడ: 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత మంగళవారం కమీషనర్ లక్స్మిషా ను కలిసి వినతి పత్రాన్ని మరొక్క సారి అందచేశారు. మొదటి సారిగా 5వ వార్డులో కమిషనర్ పర్యటించినప్పుడు అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, వారికి కావలసిన మౌలిక సదుపాయాలు గురించి తెలియచేయడం జరిగిందని గుర్తుచేశారు. అయినా నేటికి ఏ ఒక్క అభివృద్ధి, మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు తమ వార్డు ప్రజలు నోచుకోలేదని ఆమె అన్నారు. 5వ వార్డులో ప్రధాన సమస్యలు అయిన డంపింగ్ యార్డ్ పొగ వలన స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియజెప్పారు.5వ వార్డుకు శాశ్వత శానిటేషన్ ఇన్స్పెక్టర్ ను కేటాయించాలని కోరారు. అయ్యప్పనగర్ త్రాగునీటి ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగుతున్నాయని కమీషనర్ లక్ష్మిషాకు వివరించారు. 5వ వార్డు లోని ముఖ్యంగా కొండవాలు ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయని కావున మంచినీటి సదుపాయం కల్పించాలని, వేసవికాలంలో ప్రజలు త్రాగునీటికి అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాజీవ్ గృహకల్ప ఏరియా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని మెరుగుపరచాలని, అధ్వాన్నంగా ఉన్న రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యలను పరిష్కారంచెయ్యాలని, డంపింగ్ యార్డ్ కు అతి దగ్గరగా ఉన్న వార్డ్ కావున తమ వార్డ్ పై ప్రత్యేకంగా దృష్టిసారించి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేసారు. కమీషనర్ కలసిన వారిలో టిడిపి రాష్ట్ర బి.సి సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు కూడా ఉన్నారు.

