లవ్ ఎన్ కేర్ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గొడుగులు నిత్యావసరాలు పంపిణీ.

లవ్ ఎన్ కేర్ ఆధ్వర్యంలో  వీధి వ్యాపారులకు గొడుగులు నిత్యావసరాలు పంపిణీ.

విశాఖ లోకల్ విశాఖపట్నం ప్రతినిధి:

విశాఖ లోకల్ .న్యూస్.- మధురవాడ. విశాఖ జిల్లా మధురవాడ పోతిన మల్లయ్యపాలెం లో ఉన్న  లవ్ ఎన్ కేర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గొడుగులు, నిత్యావసర వస్తువులు గురువారం పంపిణీ చేశారు.  వేసవిలో రోడ్లపై ఎండల్లో చిరు వ్యాపారులులను ఆదుకోవాలని ఎన్ కేర్ మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ పి.ఏసుపాదం నగరంలోని రోడ్లపై వ్యాపారం చేసేవారు, చర్మకారులకు సుమారు వంద మందికి గొడుగులు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో ముఖ్య అతిధులు గా పాల్గొన్న లిడ్ కేప్ చైర్మన్ కె.రాజశేఖర్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కుంభ కనకారావు, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ వడ్డలి మధుసూదనరావు, మాజీ కార్పొరేటర్ కుప్పలి వెంకట్రావు, లిడ్ కాప్ డైరెక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొని పేదలకు డాక్టర్ ఏసుపాదం చేస్తున్న సేవలను కొనియాడారు.  ఈ పంపిణీ కార్యక్రమంలో శ్రీమతి మోనికా ఏసుపాదం, లవ్ ఎన్ కేర్ మినిస్ట్రీస్ డైరెక్టర్ పి.సునీల్ తదితరులు పాల్గొన్నారు.