రాష్ట్ర ప్రజలపై 1400 కోట్ల రూపాయలు విద్యుత్ చార్జీల భారం.

 రాష్ట్ర ప్రజలపై 1400 కోట్ల రూపాయలు విద్యుత్ చార్జీల భారం.

ట్రూ అప్ చార్జీల పేరుతో మరో రూ" 2900 కోట్లు
151 సీట్లు ఇచ్చి గద్దె నెక్కించిన ప్రజలకు ఉగాది కానుకగా జగనన్న విద్యుత్ చార్జీల వడ్డన
విశాఖ నగర ప్రజలపై నెలకు రూ" 18 కోట్లు అదనపు భారం
తక్షణమే రద్దు చెయ్యాలని వామపక్షాలు డిమాండ్.

పెంచిన ఛార్జీలు రద్దు చెయ్యకపోతే మరోసారి విద్యుత్ ఉద్యమం తప్పదు.

విశాఖపట్నం:

గురుద్వార.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉగాది కానుకగా రాష్ట్ర ప్రజలకు రూ" 1400 కోట్లు, ట్రూఅప్ ఛార్జీల పేరుతో మరో రూ" 2900 కోట్లు విద్యుత్ చార్జీలు పెంపుచేసి రుణం తీర్చుకున్నారని, విశాఖ నగర ప్రజలకు అదనంగా నెలకు రూ"18 కోట్ల భారం పడుతుందని పెంచిన విద్యుత్ చార్జీలు తక్షణమే రద్దు చెయ్యాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు.
విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ గురువారం వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో సీతమ్మధార ఈపిడిసిఎల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ జనవరి నెలలో విశాఖలో 3 రోజులు నిర్వహించినప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా నాయమూర్తి అంజనేయరెడ్డి గారు విద్యుత్ చార్జీల మోత సామాన్య ప్రజలపై ఉండదని చెప్పారని నిన్న వారి ప్రకటనలో ఈ చార్జీలుపెంపు ప్రజలకు పెద్దభారం కాదని చెప్పడం ప్రజలకు అన్యాయం చెయ్యడమేనని వారు న్యాయమూర్తి గనుక అన్ని ప్రభుత్వమే భరిస్తుందని చార్జీల పెంపు మోసే సామాన్య ప్రజలకు బారమని అన్నారు.గడిచిన రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి వలన ప్రజలు జీవనస్థితిగతులు దిగజారి పోయాయని వెంటనే పెంచిన విద్యుత్ చార్జీల భారం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
13 స్లాబులుగా ఉన్న వాటిని కేవలం 6స్లాబులుగా మార్చి         30 యూనిట్ల వరకు వాడిన వినియోగదారులకు 45 పైసలు పెంచారని, 31 నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు పెంచారని, 76 నుంచి 125 యూనిట్ల వరకు 1.40 పైసలు పెంచారని, 126 నుంచి 225 యూనిట్ల వరకు 1.57 పైసలు పెంచారని, 226  నుంచి 400 యూనిట్ల వరకు 1.16 పైసలు పెంచారని, 400 యూనిట్ల పైన వాడిన వారికి  55 పైసలు విద్యుత్ ఛార్జీల పెంపుతో పేద, మధ్య తరగతి ప్రజలకు 1800 కోట్ల రూపాయలు అదనపు భారం చేసి, సంపన్నులకు కేవలం పెంచినది 55 పైసలుమాత్రమేనని, ఇంకోవైపు ట్రూఅప్ చార్జీల పేరుతో మరో రూ" 2900 కోట్ల వేశారని వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చేయాలని సీపీఐ తరుపున డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో వామపక్ష పార్టీలు ఇతర అన్ని ప్రతిపక్ష పార్టీలను పౌర, ప్రజా సంఘాలను కలుపుకొని మరో విద్యుత్ ఉద్యమానికి సన్నద్ధమవుతామని హెచ్చరించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ విద్యుత్ చార్జీల పెంపుపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి రాగానే రాజన్న రాజ్యం తెస్తానని ప్రజలపై ఎటువంటి బారాలు లేకుండా పరిపాలిస్తానని విద్యుత్తు ఛార్జీల తోపాటు ఇతర ఎ రకములైన బారాలు వెయ్యనని, మడమ తిప్పను మాట మార్చను అని ఊరూరా బాకాగొట్టి మూడు సంవత్సరాలు కాలంలో ఏడుసార్లు పెంచారని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పిన వాటికి రివర్సుగా ఇసుక బాదుడు, మద్యం బాదుడు, పెట్రోల్, డీజిల్ పై పన్నులు బాదుడు, చెత్తపన్ను, ఆస్థి పన్నులు బాదుడు, పాత ఇళ్లపై కొత్తగా ఓ టి ఎస్ బాదుడు తాజాగా ఉగాది శుభాకాంక్షలతో విద్యుత్ బాదుడు ఇలా ప్రజలపై బారాలు వేస్తున్నారని విమర్శించారు. వెంటనే పెంచిన విద్యుత్ చార్జీల భారం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కె లోకనాధం, సీపీఐ, సీపిఎం నగర కార్యదర్సులు ఎం పైడిరాజు, ఎం జగ్గునాయుడు, సీపీఐ ఎం ఎల్ నాయకుడు వై కొండయ్య, వామపక్ష పార్టీల నాయకులు ఎస్ కె రెహమాన్, వై రాజు, కె సత్యనారాయణ, కృష్ణారావు, జి వామనమూర్తి, పి చంద్రశేఖర్, ఎం డి బేగం, కుమారి, పి గోవింద్ తదితరులతో పాటు పలువురు వామపక్ష పార్టీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.