పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చేయాలి. సిపిఎం.
పనులు లేక ఆదాయాలు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే, ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈ రకంగా విద్యుత్ చార్జీలు పెంచడం దుర్మార్గమని సిపిఎం మధురవాడ జోన్ కమిటీ విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వ్యతిరేకిస్తూ గురువారం మధురవాడ ఏపీ ఈ పీ డి సి ఎల్ డివిజనల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్ల కార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సిపిఎం జోన్ కార్యదర్శి డి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ నియంత్రణ మండలి సూచించిందని పేరు చెప్పి విద్యుత్ చార్జీలు పెంచడం దుర్మార్గమన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి, పేద ప్రజలను ఒకప్రక్క కేంద్ర ప్రభుత్వం మరోప్రక్క రాష్ట్ర ప్రభుత్వం అనేక రూపాల్లో పన్నులు పెంచి చార్జీలు వసూలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నా బా రా లతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని తెలియజేశారు. ఇది చాలదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు కూడా భారీగా పెంచిందని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీల ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా చేయని పరిస్థితుల్లో ప్రజలను పెద్ద ఎత్తున పోరాటంలోకి దించిన వా ళ్లు అవుతారని హెచ్చరించారు. విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు ఏ గురుమూర్తి రెడ్డి, ఎస్ పైడితల్లి, డి తులసి,